logo

తిరుమలకు గంజాయి అక్రమ రవాణా దారుణం: భాజపా

తులసీవనం లాంటి తిరుమలలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేయడం వంటి సంఘటనలు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు.

Published : 27 Mar 2023 02:35 IST

భానుప్రకాశ్‌రెడ్డి

తిరుమల, న్యూస్‌టుడే: తులసీవనం లాంటి తిరుమలలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేయడం వంటి సంఘటనలు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారి మూలమూర్తిని ఆయన దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో మూడంచెలు, నాలుగంచెల భద్రత కల్పిస్తున్నామని తితిదే చెబుతున్నా గంజాయి ఏవిధంగా పట్టుబడుతుందని ప్రశ్నించారు. పోలీసు శాఖ, విజిలెన్స్‌.. ఇతర విభాగాలు ఉన్నా తిరుమలకు గంజాయి సరఫరా వెనుక కీలకమైన వ్యక్తులు ఉన్నారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నిందితులను, వారి వెనుక ఉన్న కీలక వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఇప్పటికైనా తితిదే యాజమాన్యం దీనిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని