logo

ఐదేళ్లు పైబడిన కేసులు త్వరగా పరిష్కరించండి

వీలైనంత త్వరగా ఐదేళ్లు పైబడిన పెండింగ్‌ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ పేర్కొన్నారు.

Published : 27 Mar 2023 03:25 IST

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌కు జ్ఞాపిక బహూకరించి
 సత్కరిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు, న్యాయమూర్తులు

చిత్తూరు(న్యాయవిభాగం), న్యూస్‌టుడే: వీలైనంత త్వరగా ఐదేళ్లు పైబడిన పెండింగ్‌ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ పేర్కొన్నారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా న్యాయమూర్తుల కాన్ఫరెన్స్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా పెండింగ్‌ కేసులు త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. ఎక్కువ మందికి న్యాయం చేయాలంటే పెండింగ్‌ కేసుల పరిష్కారంతోనే సాధ్యమన్నారు. తొలుతగా ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి విచ్చేసిన జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ను.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు, కలెక్టర్‌ హరినారాయణన్‌, ఎస్పీ రిశాంత్‌రెడ్డి, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఆరో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శాంతి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కరుణకుమార్‌, ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులు, ఆర్డీవో రేణుక, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజేంద్రరెడ్డి, న్యాయ వాదులు, పోలీసు అధికారులు, కోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని