logo

సమష్టి కృషితో ఎస్వీయూ అభివృద్ధి

ఉద్యోగులు, విద్యార్థుల సమష్టికృషితో ఎస్వీయూ అభివృద్ధి సాధిస్తోందని వీసీ ఆచార్య రాజారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వర్సిటీలోని సెనేట్‌హాల్‌లో ఆయన అధ్యక్షతన సెనేట్‌ సమావేశం జరిగింది.

Published : 01 Apr 2023 03:09 IST

ప్రసంగిస్తున్న వీసీ రాజారెడ్డి

తిరుపతి(ఎస్వీయూ): ఉద్యోగులు, విద్యార్థుల సమష్టికృషితో ఎస్వీయూ అభివృద్ధి సాధిస్తోందని వీసీ ఆచార్య రాజారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వర్సిటీలోని సెనేట్‌హాల్‌లో ఆయన అధ్యక్షతన సెనేట్‌ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్‌లో పలు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తుచేసి సెనేట్‌ అనుమతి తీసుకున్నారు. నూతన విద్యావిధానం ప్రకారం కోర్సులు, నూతన సిలబస్‌ను సెనేట్‌సభ్యులు ఆమోదించారు. కార్యక్రమంలో ఆచార్య అప్పారావు, ఎంఎం నాయుడు, రత్నాకర్‌, నారాయణరెడ్డి, ఎస్‌డీఎస్‌ మూర్తి, మురళీధర్‌, పద్మనాభం, తులసీరామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు