logo

ఒకటే యంత్రం.. లేదే పరిష్కారం

కాకినాడ జీజీహెచ్‌లో సీటీ స్కానింగ్‌ కేంద్రం వద్ద నిరీక్షిస్తున్న రోగులు, వారి బంధువులు వీరంతా. ఒక్కటే యంత్రం ఉండటం.. బాధితుల తాకిడి ఎక్కువ కావటంతో అత్యవసర స్థితిలో ఉన్న రోగులకు సైతం ఇక్కట్లు తప్పటం లేదు. ఇక్కడ ప్రతి రోజూ సరాసరి 100 నుంచి 120 మంది

Published : 21 Jan 2022 04:42 IST

కాకినాడ జీజీహెచ్‌లో సీటీ స్కానింగ్‌ కేంద్రం వద్ద నిరీక్షిస్తున్న రోగులు, వారి బంధువులు వీరంతా. ఒక్కటే యంత్రం ఉండటం.. బాధితుల తాకిడి ఎక్కువ కావటంతో అత్యవసర స్థితిలో ఉన్న రోగులకు సైతం ఇక్కట్లు తప్పటం లేదు. ఇక్కడ ప్రతి రోజూ సరాసరి 100 నుంచి 120 మంది రోగులకు స్కానింగ్‌ చేస్తుంటారు. ఒక్కో రోగి పరిస్థితిని అనుసరించి 10 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. ఈ లెక్కన ఆసుపత్రిలో ఒకే యంత్రం ఉండటంతో రోగులకు నిరీక్షణ తప్పటం లేదు. ఒకరకంగా చెప్పాలంటే.. అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగులు, వారి బంధువుల వేదన వర్ణనాతీతం. మరో యంత్రం ఏర్పాటు చేస్తే సమస్య కొంత వరకు తగ్గుతుందని బాధితులు కోరుతున్నారు. ఈవిషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వెంకట బుద్ధ దృష్టికి తీసుకెళ్లగా.. గురువారం రోగుల తాకిడితో నిరీక్షించే పరిస్థితి ఎదురైందనీ.. మరో సీటీ స్కానింగ్‌ యంత్రం ఏర్పాటుకు ఎలాంటి ప్రతిపాదన లేదన్నారు. -ఈనాడు, కాకినాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని