logo

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

రామవరంలో బుధవారం రాత్రి బెట్టింగ్‌ ముఠాను అరెస్ట్‌ చేసినట్లు అనపర్తి సీఐ జేవీ రమణ గురువారం విలేకరులకు తెఇపారు. రామవరంలో క్రికెట్‌ బెట్టింగ్‌ జరుగుతుందన్న సమాచారం మేరకు ఎస్సై ఉమామహేశ్వరరావు, సిబ్బందితో కలిసి స్థానిక స

Published : 20 May 2022 05:45 IST


మాట్లాడుతున్న అనపర్తి సీఐ రమణ

 

అనపర్తి, న్యూస్‌టుడే: రామవరంలో బుధవారం రాత్రి బెట్టింగ్‌ ముఠాను అరెస్ట్‌ చేసినట్లు అనపర్తి సీఐ జేవీ రమణ గురువారం విలేకరులకు తెఇపారు. రామవరంలో క్రికెట్‌ బెట్టింగ్‌ జరుగుతుందన్న సమాచారం మేరకు ఎస్సై ఉమామహేశ్వరరావు, సిబ్బందితో కలిసి స్థానిక సబ్బెళ్ల సత్యనారాయణరెడ్డి ఇంటిలో సోదాలు చేశామన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌ పాల్పడుతున్న అయిదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి నుంచి ఎనిమిమిది మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌, టీవీ, రూ.2.50 లక్షల నగదు, బెట్టింగ్‌కు సంబంధించిన వివరాలు నమోదు చేసిన పుస్తకం స్వాధీనం చేసుకున్నామన్నారు. వారి కాల్‌డేటా ఆధారంగా మరికొంతమంది ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు పాల్పడినట్లు, ఈ సీజన్లో సుమారు రూ.51 లక్షల లావాదేవీలు జరిగినట్లు తెలిసిందన్నారు. రామవరం గ్రామానికి చెందిన సబ్బెళ్ల సత్యనారాయణరెడ్డి, తేతలి కృష్ణారెడ్డి, కర్రి రమాకాంత్‌రెడ్డి, కర్రి వీరవెంకట సత్యనారాయణరెడ్డి, పీరా రామచంద్రపురం గ్రామానికి చెందిన తమలంపూడి వెంకటరెడ్డిని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఇందులో ఒకరు బిక్కవోలు మండల ఎఫ్‌వోఏ ఉద్యోగి, మరొకరు తెదేపా నాయకుడు ఉన్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని