logo

జీజీహెచ్‌లో శిశువుకు పునర్జన్మ

బరువు తక్కువ ఉన్న నవజాత శిశువుకు కాకినాడ జీజీహెచ్‌ వైద్యులు పునర్జన్మనిచ్చి తల్లి చెంతకు చేర్చారు. సూపరింటెండెంట్‌ వెంకటబుద్ధ శుక్రవారం వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం

Published : 02 Jul 2022 03:29 IST

బిడ్డను తల్లికి అప్పగించిన వైద్యులు

కాకినాడ (మసీదుసెంటర్‌): బరువు తక్కువ ఉన్న నవజాత శిశువుకు కాకినాడ జీజీహెచ్‌ వైద్యులు పునర్జన్మనిచ్చి తల్లి చెంతకు చేర్చారు. సూపరింటెండెంట్‌ వెంకటబుద్ధ శుక్రవారం వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతానికి చెందిన తప్పెట్ల పరిమళ ఈ ఏడాది ఏప్రిల్‌ 24న రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. వీరిలో మగ, ఆడ శిశువులున్నారు. ఆడ శిశువు 600 గ్రాముల బరువు మాత్రమే ఉండడం, పరిస్థితి విషమంగా ఉండటంతో అదేరోజు జీజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. పిడియాట్రిక్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఎం.ఎస్‌.రాజు, ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రతిమాదేవి, డాక్టర్‌ వెంకటేశ్వర్లు వైద్య బృందం ఆధ్వర్యంలో శిశువును రెండు నెలల నుంచి ఎన్‌ఐసీయూలో ఉంచి అత్యున్నత వైద్యం అందించి పునర్జన్మ ఇచ్చారని సూపరింటెండెంట్‌ తెలిపారు. శిశువును ఆసుపత్రిలో చేర్చిన సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. ఎంట్రోకొలాటిస్‌, జాండీస్‌, లంగ్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చాయన్నారు. రెండుసార్లు రక్త మార్పిడి చేశామని, ట్యూబ్‌ ద్వారా ఆహారం అందించామని చెప్పారు. ఎన్‌ఐసీయూ వైద్యులు శ్రద్ధ తీసుకుని శిశువుకు మందులు, రక్తం, యాంటీబయోటిక్స్‌ వంటివి వాడి రూ.10 లక్షల ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించామన్నారు. ప్రస్తుతం ఆ శిశువు 1.4 కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉందని వివరించారు. శుక్రవారం ఉదయం డిశ్చార్జి చేసి తల్లికి అప్పగించారు.   తమ పాపకు పునర్జన్మ ఇచ్చిన జీజీహెచ్‌ వైద్యులకు తల్లి పరిమళ కృతజ్ఞతలు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని