logo

ఆంధ్రా అబ్బాయి.. అమెరికా అమ్మాయి

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అబ్బాయికి, అమెరికా అమ్మాయికి వివాహమైంది. వివరాల్లోకి వెళ్తే... దేవరపల్లి మండలం ధూమంతునిగూడేనికి చెందిన ధూమంతరావు చలపతి అచ్యుతరామారావు, లక్ష్మి దంపతులు 22 ఏళ్ల క్రితం

Published : 13 Aug 2022 03:41 IST

న్యూస్‌టుడే, దేవరపల్లి: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అబ్బాయికి, అమెరికా అమ్మాయికి వివాహమైంది. వివరాల్లోకి వెళ్తే... దేవరపల్లి మండలం ధూమంతునిగూడేనికి చెందిన ధూమంతరావు చలపతి అచ్యుతరామారావు, లక్ష్మి దంపతులు 22 ఏళ్ల క్రితం ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా పెద్దకుమారుడు ఆదిత్య భౌతికశాస్త్రంలో పీహెచ్‌డీ చేసి, అక్కడే శాస్త్రవేత్తగా ఉద్యోగం చేస్తున్నారు. అమెరికాకు చెందిన అలాన్‌ హార్ట్సో-జానస్‌ హార్ట్సోల కుమార్తె ఎమిలీకి, ఆదిత్యకు గురువారం రాత్రి దేవరపల్లిలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహమైంది. శుక్రవారం ఉదయం రిసెప్షన్‌ జరగ్గా గ్రామస్థులు అందరూ వచ్చి ఆశీర్వదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని