logo

విద్యావ్యతిరేక విధానాలపై పోరాడాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై విద్యార్థులంతా పోరాడాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ పిలుపునిచ్చారు. శనివారం కచేరీపేటలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ జిల్లా ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Published : 02 Oct 2022 04:20 IST

మాట్లాడుతున్న అశోక్, వేదికపై ప్రతినిధులు

గాంధీనగర్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై విద్యార్థులంతా పోరాడాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ పిలుపునిచ్చారు. శనివారం కచేరీపేటలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ జిల్లా ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు లోవతల్లి జెండా ఆవిష్కరించారు. అనంతరం అశోక్‌ మాట్లాడుతూ కేంద్రం నూతన జాతీయ విద్యావిధానం పేరుతో విద్యను కార్పొరేటీకరించడానికి ప్రయత్నిస్తోందన్నారు. నూతన విధానం అమలైతే పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. దేశంలో ఏరాష్ట్రమూ నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయడం లేదని, ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి దీని అమలుకు ఉత్సాహం చూపించడం దారుణమన్నారు. సంక్షేమ వసతిగృహాలను గాలికి వదిలేశారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.రాము, టి.రాజా, నగర కార్యదర్శి గంగాసూరిబాబు, జిల్లా నాయకులు వరహాలు, శ్రీకాంత్, జగదీష్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని