logo

‘మంత్రి తన స్థాయి మరచి మాట్లాడారు’

రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా ఇటీవల ఎన్టీఆర్‌ను ఉద్దేశించి తన స్థాయిని మరచి మాట్లాడారని కాకినాడ జిల్లా తెదేపా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌ మండిపడ్డారు. రెండుసార్లు వెన్నుపోటు పొడిపించుకున్న అసమర్థుడు ఎన్టీఆర్‌ అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు.

Published : 05 Oct 2022 05:23 IST

  మాట్లాడుతున్న జ్యోతుల నవీన్‌, పక్కనే నాయకులు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా ఇటీవల ఎన్టీఆర్‌ను ఉద్దేశించి తన స్థాయిని మరచి మాట్లాడారని కాకినాడ జిల్లా తెదేపా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌ మండిపడ్డారు. రెండుసార్లు వెన్నుపోటు పొడిపించుకున్న అసమర్థుడు ఎన్టీఆర్‌ అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు. కాకినాడలోని తెదేపా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దన్నారు. ఆయనకు పదవీ వ్యామోహం లేదన్నారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్‌ అని గుర్తుచేశారు. పేదల కోసం పక్కా గృహం, పింఛను, పంచె, ధోవతి, కిలో రూ.2 బియ్యం వంటి పథకాలను అమల్లోకి తెచ్చిన ఘనత ఆయనదేనన్నారు. మంత్రి వ్యాఖ్యలు యావత్తు తెలుగు జాతిని బాధించాయని చెప్పారు. మంత్రి ఎన్టీఆర్‌పై ఇటువంటి వ్యాఖ్యలు మరొకసారి చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని నవీన్‌కుమార్‌ హెచ్చరించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బుధవారం నుంచి జగ్గంపేట నియోజకవర్గంలో పాదయాత్ర తలపెట్టినట్లు ఆయన వెల్లడించారు. పెరిగిన విద్యుత్తు, ఆర్టీసీ, నిత్యావసర సరకులు తదితర ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ పాదయాత్ర చేస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గ పరిధి మండలాల్లో ఈ యాత్ర కొనసాగుతుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్‌, మట్టా ప్రకాష్‌గౌడ్‌, జిల్లా తెదేపా ఎస్సీ విభాగం అధ్యక్షుడు కొల్లాబత్తుల అప్పారావు, నాయకులు తూము కుమార్‌, జహరుద్దీన్‌ జిలానీ, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని