logo

‘ప్రశ్నించేవారిపై కేంద్రం కక్ష సాధింపు’

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ సంపదను దోచి కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతోందని, ప్రశ్నించేవారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ ధ్వజమెత్తారు.

Published : 26 Mar 2023 05:04 IST

మాట్లాడుతున్న హర్షకుమార్‌

దేవీచౌక్‌(రాజమహేంద్రవరం): కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ సంపదను దోచి కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతోందని, ప్రశ్నించేవారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడంలో ప్రణాళిక ప్రకారం వ్యవహరించారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా ఓటమికి జగనే కారణమన్నారు. ముఖ్యమంత్రిపై పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు అవకాశం కోసం చూస్తున్నారన్నారు. ఏ మాత్రం రాష్ట్రాభివృద్ధి లేకుండా కేవలం డబ్బులు పంచడం పరిపాలనే కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత క్రిష్టియన్లను ఎస్సీల్లో చేరుస్తూ తీర్మానం ఆమోదించినంత మాత్రాన ఒరిగేదేమీ లేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే ఈ తీర్మానం చేశారన్నారు.  వైకాపా అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని