logo

సాహసోపేతం.. అభయహస్తం

కాకినాడ సముద్ర జలాల్లో బుధవారం కోస్ట్‌గార్డ్‌ నౌకలు సందడి చేశాయి. రీజనల్‌ సెర్చ్‌, రెస్క్యూ ఎక్సర్‌సైజ్‌(సారెక్స్‌-2023) పేరిట నిర్వహించిన మాక్‌ డ్రిల్‌లో ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది ధైర్యసాహసాలు ప్రదర్శించారు.

Published : 30 Mar 2023 05:26 IST

ప్రమాద నౌకవద్దకు చేరుకుంటున్న కోస్ట్‌గార్డు నౌకలు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కాకినాడ సముద్ర జలాల్లో బుధవారం కోస్ట్‌గార్డ్‌ నౌకలు సందడి చేశాయి. రీజనల్‌ సెర్చ్‌, రెస్క్యూ ఎక్సర్‌సైజ్‌(సారెక్స్‌-2023) పేరిట నిర్వహించిన మాక్‌ డ్రిల్‌లో ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కాకినాడ కోస్ట్‌గార్డు స్టేషన్‌ కమాండెంట్‌ టీఆర్‌కే రావు మాట్లాడుతూ భారత తీర రక్షణ దళం అసమాన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ప్రపంచంలో అత్యుత్తమ దళాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. నౌకల్లో విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఈ దళం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు జిల్లా యంత్రాంగం సహకారం మరువలేమన్నారు. కాకినాడ జిల్లా డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, ఇండియన్‌ కోస్ట్‌గార్డు కాకినాడ స్టేషన్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సహాయక చర్యలు


నౌకపైకి నీటిని వెదజల్లుతూ..


విన్యాసాలకు వేదిక.. ప్రధాన నౌక


చిక్కుకున్నా కాపాడండి...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని