చంద్రన్న మాట.. వరాల మూట
రాజమహేంద్రవరంలో మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో మహిళలకు వరాల మూటని రాజమహేంద్రవరం పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి అన్నారు.
క్షీరాభిషేకం చేస్తున్న తెలుగు మహిళలు
టి.నగర్(రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో మహిళలకు వరాల మూటని రాజమహేంద్రవరం పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి అన్నారు. తిలక్ రోడ్డులోని అర్బన్ ఎమ్మెల్యే నివాసం వద్ద మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటించిన ఆరు పథకాలు అందరికీ మేలు చేస్తాయన్నారు. మహిళలు, యువత, రైతులు, పేదలు, బీసీ వర్గాలు ఈ పథకాలకు కచ్చితంగా పట్టం కట్టి తీరతారన్నారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తురకల నిర్మల మాట్లాడుతూ పథకాలు పేదలను ఆర్థికంగా సుస్థిరం చేయడంతోపాటు ఎన్నికల్లో తిరుగులేని జనాదరణ తెచ్చి పెడతాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.