శిక్షణ ముగిసే నాటికి ఆట ఆరంభం
జిల్లావ్యాప్తంగా 49 శిబిరాలు... ఒక్కోదానికి 80 మంది బాలబాలికల ఎంపిక... నెలరోజుల పాటు వీరికి శిక్షణ... క్రీడా పరికరాలు, శిక్షకుల ఫీజు నిమిత్తం శిబిరానికి రూ.7 వేలు మంజూరు... ఇదీ శాప్ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ ప్రణాళిక.
వేసవి శిబిరాలకు 30 రోజులకు పరికరాలు!
న్యూస్‌టుడే, శ్యామలాసెంటర్ (రాజమహేంద్రవరం)
ఎస్‌కేవీటీలో ఫుట్‌బాల్ శిబిరంలో క్రీడాకారులు
జిల్లావ్యాప్తంగా 49 శిబిరాలు... ఒక్కోదానికి 80 మంది బాలబాలికల ఎంపిక... నెలరోజుల పాటు వీరికి శిక్షణ... క్రీడా పరికరాలు, శిక్షకుల ఫీజు నిమిత్తం శిబిరానికి రూ.7 వేలు మంజూరు... ఇదీ శాప్ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ ప్రణాళిక. మే 1న శిక్షణ ప్రారంభమయ్యే నాటికి శిక్షణ పరికరాలు అందాల్సి ఉంది. మహా అయితే వారం, పది రోజులు ఆలస్యమవ్వాలి. జిల్లాలో మాత్రం రెండు రోజుల్లో శిక్షణ ముగుస్తుందనగా హడావుడిగా పరికరాలు అందించారు. పరికరాలు అందక కొన్నిచోట్ల శిబిరాల నిర్వహణే ఆగిపోగా.. మరికొన్నిచోట్ల తూతూమంత్రంగా సాగాయి.
ఏటా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను శాప్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మండలి నిర్వహిస్తుంటుంది. రాజమహేంద్రవరంలో సుమారు 14 శిబిరాలు... అనపర్తి, కొవ్వూరు, ద్వారపూడి, రాజానగరం, కడియం తదితర ప్రాంతాలతో కలిపితే మొత్తం 49 వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభించారు. శిబిరాలు రెండు రోజుల్లో ముగుస్తున్నాయనే సమయంలో హడావుడికి కొందరికి క్రీడా సామగ్రి అందించారు. దీంతో శిబిరాలను కొంతమంది ఆరంభ శూరత్వంగా ప్రారంభించి వదిలేయగా, మరికొన్ని చోట్ల పట్టుమని పదిమంది కూడా లేకుండా తూతూ మంత్రంగా కొనసాగించారు. ఇంకొన్ని శిబిరాలను పాత సామగ్రితో కొనసాగించారు. మరికొంతమంది శిబిర నిర్వాహకులు తమ సొంత నగదుతో ముందుగా అవసరమైన క్రీడా పరికరాలు కొనుగోలు చేసి నిర్వహించారు.
ఏటా నిర్వహించేదే అయినా ఎందుకీ నిర్లక్ష్యం
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలనేవి ఏటా ప్రభుత్వం నిర్వహిస్తుంది. గతేడాది కూడా ఇలాగే శిబిరం పూర్తయ్యేనాటికి పరికరాలు ఇచ్చారని ఓ శిబిరం నిర్వాహకుడు తెలిపారు. ఏటా నిర్వహించే శిబిరాల విషయంలో ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. సుమారు మూడున్నర లక్షల రూపాయల క్రీడా సామగ్రి కొనుగోలు చేయడానికి ఇంత సమయం ఎందుకు పడుతుందని ప్రశ్నిస్తున్నారు. పరికరాల కొనుగోలుకు ఉమ్మడి జిల్లాలో సుమారు 40 వరకు దుకాణాలుండగా ఇతర రాష్ట్రాల నుంచి రప్పించటంలో ఆంతర్యం ఏమిటని క్రీడా నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఏటా మేలో నిర్వహించే శిక్షణకు రెండు నెలల ముందుగానే నిర్వాహకులతో సమావేశమై ఎటువంటి సామగ్రి కావాలో తెలుసుకుని ప్రారంభం నాటికి ఇస్తే క్రీడాకారులతో శిబిరాలు కళకళలాడుతుంటాయని పలువురు అంటున్నారు.
సామగ్రి లభ్యంకాకే ఆలస్యం
కొన్ని రకాల క్రీడా సామగ్రి లభ్యం కాకపోవటం వల్ల కొనుగోలు ఆలస్యమైంది. శిబిర నిర్వాహకులు వారికి కావాల్సిన సామగ్రి ప్రతిపాదనలు అందజేయటంలోనూ కొంత ఆలస్యమైంది.
డి.శేషగిరి, జిల్లా ముఖ్య క్రీడాశిక్షకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ravi Kishan : దానిశ్ అలీ గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు.. చర్యలు తీసుకోండి : రవికిషన్
-
Nagababu: చంద్రబాబు అరెస్టుపై జనసైనికులు ఆవేదనతో ఉన్నారు: నాగబాబు
-
Khalistani ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. 19మంది ఆస్తుల జప్తునకు NIA సిద్ధం!
-
Rahul Gandhi: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయి..! తెలంగాణలో భాజపాపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
Canada: నిజ్జర్ హత్యపై అమెరికా నుంచే కెనడాకు కీలక సమాచారం..!
-
Vande Bharat: ప్రయాణికుల సూచనలతో.. వందే భారత్ కోచ్‌లలో సరికొత్త ఫీచర్లు