logo

Kakinada: వైకాపా ఎంపీ నుంచి రక్షించాలంటూ ఆడపడుచు ఫిర్యాదు

కాకినాడ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆమె ఆడపడుచు పుప్పాల కళావతి సోమవారం కాకినాడలో నిర్వహించిన స్పందనలో కలెక్టర్‌ కృతికాశుక్లాకు ఫిర్యాదు చేశారు

Updated : 06 Jun 2023 08:41 IST

కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో ప్లకార్డుతో కళావతి

కాకినాడ కలెక్టరేట్‌: కాకినాడ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆమె ఆడపడుచు పుప్పాల కళావతి సోమవారం కాకినాడలో నిర్వహించిన స్పందనలో కలెక్టర్‌ కృతికాశుక్లాకు ఫిర్యాదు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామలో ఎంపీ గీత సోదరుడు, నా భర్త అయిన పీవీవీజీ కృష్ణకుమార్‌కు వారసత్వంగా రావాల్సిన  6.50 ఎకరాల పంటభూమి, కాకినాడ నగరంలో 600 గజాల ఇంటిని ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పిల్లలు మైనర్లుగా ఉండగా, 2006లో ఎంపీ మాయమాటలు చెప్పి ఆస్తులు ఆక్రమించారన్నారు. అనంతరం ఆయన మరణించారని, ఇప్పుడు పిల్లలు పెద్దవారు కావడంతో ఆ ఆస్తుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధపడగా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 9న మా ఇంట్లో దొంగతనం చేయించారని ఆరోపించారు. 30 కాసుల బంగారం, రూ.50 వేలు దొంగలు అపసహరించుకుపోయారన్నారు. దీనిపై సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలోనూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎంపీ భర్త విశ్వనాథ్‌, మరో ఆడపడుచు భర్త కనకాల రవికుమార్‌తో కలిసి గీత మా కుటుంబాన్ని చంపాలని చూస్తున్నారని, రక్షణ కల్పించాలని కోరారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని