logo

Cyber Crime: వర్కు ఫ్రమ్‌ హోమ్‌ పేరిట రూ.4 లక్షలు దోచేశారు!

ఇంటి వద్దనే ఉంటూ ఆన్‌లైన్‌లో పనిచేసి నగదు సంపాదించవచ్చునని చరవాణికి వచ్చిన సందేశానికి స్పందిస్తే రూ.లక్షలు దోచుకున్నారంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన ఘటన రాజమహేంద్రవరం మూడో పట్టణ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

Updated : 17 Feb 2024 08:57 IST

రాజమహేంద్రవరం నేరవార్తలు: ఇంటి వద్దనే ఉంటూ ఆన్‌లైన్‌లో పనిచేసి నగదు సంపాదించవచ్చునని చరవాణికి వచ్చిన సందేశానికి స్పందిస్తే రూ.లక్షలు దోచుకున్నారంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన ఘటన రాజమహేంద్రవరం మూడో పట్టణ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వీరయ్యగౌడ్‌ వివరాల మేరకు.. సుభాష్‌నగర్‌కు చెందిన కె.రవిప్రసాద్‌ నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. ఇతని భార్య దివ్యసురేఖ గృహిణి. గత నెల 15న తన ఇన్‌స్టాగ్రామ్‌కు.. ఇంటి వద్దనే ఉంటూ ఆన్‌లైన్‌లో నగదు సంపాదించవచ్చని ఓ సందేశం వచ్చింది. లింక్‌ క్లిక్‌ చేయగా టెలిగ్రామ్‌లో మరో లింక్‌ తెరుచుకుంది. ఓ అయిదు దఫాలుగా నగదును చెల్లించి టాస్కులు చేయగా రెట్టింపు వచ్చింది. అనంతరం మీరు చెల్లిస్తున్న మొత్తానికి రెట్టింపు చెల్లిస్తేనే మీ నగదు తిరిగి వస్తుందని సందేశాలు రావడంతో పలు దఫాలుగా రూ.4.08 లక్షలు వరకూ ఆన్‌లైన్‌లో ఆమె చెల్లించారు. తరువాత కూడా మరో రూ.5 లక్షలు చెల్లించాలని సందేశం రావడంతో మోసపోయానని గ్రహించి బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని