logo

సత్యదేవుని కల్యాణోత్సవాలపై సమీక్ష నేడు

మే 18 నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణ, భక్తులకు ఏర్పాట్లపై ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నామని ఆలయ అధికారులు తెలిపారు.

Published : 28 Apr 2024 03:53 IST

అన్నవరం: మే 18 నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణ, భక్తులకు ఏర్పాట్లపై ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నామని ఆలయ అధికారులు తెలిపారు. దేవస్థానం ఈవో కె. రామచంద్రమోహన్‌, పెద్దాపురం ఆర్డీవో ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులు ఈ చర్చల్లో పాల్గొంటారు. మే 19న స్వామివారి కల్యాణానికి ఏర్పాట్లు, గ్రామోత్సవాల నిర్వహణ, శ్రీ చక్రస్నానానికి పంపాలో నీటి కొరత సమస్య, ముందస్తు ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని