logo

దాతలు స్థలమిస్తే బస్టాండ్‌ విస్తరిస్తాం : ఆర్‌ఎం

వినుకొండ బస్టాండ్‌ ఇరుకుగా ఉండి ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమని, దానిని విస్తరించేందుకు స్థల సమస్య ఎదురవుతుందని దాతలు ఉదారంగా అవసరమైన స్థలం ఇస్తే అభివృద్ధి చేస్తామని ఆర్టీసీ గుంటూరు ఆర్‌ఎం విజయగీత తెలిపారు. శనివారం

Published : 05 Dec 2021 01:21 IST


గ్యారేజీలో మొక్క నాటి నీరు పోస్తున్న విజయగీత

వినుకొండ, శావల్యాపురం : వినుకొండ బస్టాండ్‌ ఇరుకుగా ఉండి ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమని, దానిని విస్తరించేందుకు స్థల సమస్య ఎదురవుతుందని దాతలు ఉదారంగా అవసరమైన స్థలం ఇస్తే అభివృద్ధి చేస్తామని ఆర్టీసీ గుంటూరు ఆర్‌ఎం విజయగీత తెలిపారు. శనివారం ఆమె పలువురు ఆర్టీసీ అధికారులతో కలిసి డిపో గ్యారేజీ, బస్టాండ్‌ను కలియతిరిగి చూశారు. అసంపూర్తిగా నిలిచిన మరుగుదొడ్ల నిర్మాణ స్థలాన్ని సైకిల్‌ స్టాండ్‌కు కేటాయించాలని డిపో అధికారులకు సూచించారు. అంతకు ముందు గ్యారేజీ ఆవరణలో మొక్క నాటారు. శావల్యాపురం బస్టాండ్‌ను పరిశీలించిన ఆర్‌ఎం, త్వరలో వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. పర్యటనలో సీటీఎం రాజశేఖర్‌, సీఎంఈ శరత్‌బాబు, డిపో మేనేజర్‌ కోటేశ్వరరావునాయక్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని