logo

కత్తులు దూసిన కోళ్లు

పండగ రోజు పందెం కోళ్లు కత్తులు దూశాయి. పోలీసుల ఆంక్షల్ని బేఖాతరు చేస్తూ అధికార పార్టీ నేతలు తీరంలో ఏర్పాటు చేసిన బరుల్లో భారీగా పందేలు వేశారు. పండగ మూడ్రోజులు రూ.కోట్లు చేతులు మారాయి. జూదం విచ్చలవిడిగా సాగింది. బరుల వద్దకు వేల సంఖ్యలో ప్రజలు తరలిరావటంతో జాతర వాతావరణం

Published : 17 Jan 2022 02:33 IST

చేతులు మారిన రూ.కోట్లు

కోడి పందేల బరి వద్ద జనం

బాపట్ల, రేపల్లె అర్బన్‌ పండగ రోజు పందెం కోళ్లు కత్తులు దూశాయి. పోలీసుల ఆంక్షల్ని బేఖాతరు చేస్తూ అధికార పార్టీ నేతలు తీరంలో ఏర్పాటు చేసిన బరుల్లో భారీగా పందేలు వేశారు. పండగ మూడ్రోజులు రూ.కోట్లు చేతులు మారాయి. జూదం విచ్చలవిడిగా సాగింది. బరుల వద్దకు వేల సంఖ్యలో ప్రజలు తరలిరావటంతో జాతర వాతావరణం కనిపించింది. భట్టిప్రోలు మండలం పల్లెకోన, రేపల్లె మండలం పేటేరు, నిజాంపట్నం బరులు జనంతో కిక్కిరిసి పోయాయి. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి పెద్దసంఖ్యలో గుమిగూడినా పోలీసులు ఆ వైపే చూడలేదు. నేతలు, పోలీసుల సహకారంతో పందేలు యథేచ్ఛగా కొనసాగాయి. హైదరాబాద్‌, చెన్నై, ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, బాపట్ల, పొన్నూరు, రేపల్లె, తెనాలి ప్రాంతాలకు చెందిన పందెం రాయుళ్లు రూ.లక్షలు కాశారు. బరుల వద్దే పందెం కోళ్లు విక్రయానికి ఉంచారు. ఒక్కో కోడిని రూ.50 వేల నుంచి లక్ష వరకు విక్రయించారు. బరుల వద్ద బాహాటంగా గొలుసు దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం విక్రయించారు. పందేలు చూడటానికి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు తరలించారు. వీరి కోసం ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేసి మాంసం వంటకాలు విక్రయించారు. పల్లెకోన బరి వద్ద అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా కోళ్ల పందేలు వేశారు.

జూదం ఆడుతూ..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని