logo

తప్పు ఎవరిదైనా.. శిక్ష ఉపాధ్యాయులకే..

ఉపాధ్యాయులకు ఆదాయ పన్ను,  ప్రావిడెంట్‌ ఫండ్‌(పీఎఫ్‌) జమ కాలేదని తాకీదులు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయులు అందరూ సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

Updated : 02 Dec 2022 08:08 IST

ఐటీ, పీఎఫ్‌  జమకాక ఇక్కట్లు

ఈనాడు-అమరావతి

పాధ్యాయులకు ఆదాయ పన్ను,  ప్రావిడెంట్‌ ఫండ్‌(పీఎఫ్‌) జమ కాలేదని తాకీదులు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయులు అందరూ సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. చివరకు జీతాల బిల్లులు పాస్‌ చేయాల్సిన ఖజానా అధికారులు సమ్మెబాట పట్టడంతో ఆ నెలలో ఉద్యోగులకు సంబంధించిన జీతాలను ప్రభుత్వమే నేరుగా ఉద్యోగి ఖాతాలోకి జమ చేసింది. దీంతో ఆనెలలో ఉద్యోగుల నుంచి మినహాయించాల్సిన ఆదాయపన్ను, ప్రావిడెంట్‌ ఫండ్‌ వివరాలను సంబంధిత శాఖలకు పంపలేదు. ప్రస్తుతం ఆ నెలకు సంబంధించి చెల్లించలేదని సూచిస్తూ కొందరు ఉద్యోగులకు నోటీసులు అందాయి.

ప్రధానంగా ఐటీశాఖ నుంచి నోటీసు పంపి అందులో మీరు కట్టాల్సిన డ్యూ ఇంత అని స్పష్టంగా పేర్కొంటున్నారు. పీఎఫ్‌కు సంబంధించి డీడీఓలకు ఫోన్లు చేసి ఆనెలలో ఎంతమంది ఉద్యోగులకు పీఎఫ్‌ ఎంత మినహాయించారో వివరాలు సమర్పించలేదని, అందుకే ఈనెలలో పీఎఫ్‌ ఖాతాలను సర్దుబాటు చేయలేదని చెబుతున్నారు. మరోవైపు ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగులకు జవనరి నెలలో సొమ్ములు సర్దుబాటు కాలేదని పీఎఫ్‌ క్లోజర్‌ పెట్టుకోవటానికి వీల్లేకుండా పోయింది. మొత్తంగా పదవి విరమణ ఉద్యోగులకు పీఎఫ్‌ క్లోజర్స్‌ పెట్టుకోవటానికి అవకాశం లేకుండా పోవటంతో వారు ఆందోళన చెందుతున్నారు.


ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి

ఈ సమస్యపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని యూటీఎఫ్‌ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్‌ డిమాండ్‌ చేశారు. కనీసం ఉద్యోగ విరమణచేసిన వారికి జనవరి నెలలో పీఎఫ్‌ వివరాలు అందలేదని క్లోజర్స్‌ పెట్టుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. బాధిత ఉపాధ్యాయులు విరమణ డబ్బులతో ఏదైనా ఇల్లు, ప్లాటు కొనుక్కోవాలని ఆశపడి చివరకు భంగపాటుకు గురవుతున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని