logo

బల్లకట్లు వేలానికి రెండోసారీ గైర్హాజరు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమైన మాదిపాడు, పుట్లగూడెం, గోవిందాపురం బల్లకట్లు 2023-24 ఏడాదిలో నిర్వహణకు జిల్లాపరిషత్తు అధికారులు నిర్వహించిన వేలానికి గుత్తేదారులు మూకుమ్మడిగా గైర్హాజరయ్యారు.

Published : 22 Mar 2023 05:26 IST

గుత్తేదారుల కోసం ఎదురు చూస్తున్న జడ్పీ ఉద్యోగులు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమైన మాదిపాడు, పుట్లగూడెం, గోవిందాపురం బల్లకట్లు 2023-24 ఏడాదిలో నిర్వహణకు జిల్లాపరిషత్తు అధికారులు నిర్వహించిన వేలానికి గుత్తేదారులు మూకుమ్మడిగా గైర్హాజరయ్యారు. జిల్లాపరిషత్తు కార్యాలయంలో మంగళవారం రెండోసారి మూడు బల్లకట్లుతో పాటు కొల్లిపర మండలం వల్లభాపురం, మున్నంగి, అచ్చంపేట మండలం మాదిపాడు పడవలకు వేలం నిర్వహించారు. బల్లకట్లుతో పాటు మున్నంగి, మాదిపాడు పడవలకు గుత్తేదారులు ఎవరూ టెండర్లు దాఖలు చేయలేదు. గుత్తేదారుల కోసం జడ్పీ ఉద్యోగులు సాయంత్రం 5 గంటల వరకు ఎదురు చూసినప్పటికీ వల్లభాపురం పడవకు ఇద్దరు గుత్తేదారులు టెండర్లు దాఖలు చేయగా నడకుదిటి చిన సుబ్రహ్మణ్యం అనే గుత్తేదారు రూ.1,01,000కు పాట పాడటంతో అధికారులు ఆయన పేరిట ఖరారు చేశారు. మూడు బల్లకట్లు ద్వారా జిల్లాపరిషత్తుకు రూ.కోటి వరకు ఆదాయం వస్తుందని పాలకవర్గం, అధికారులు భావించగా గుత్తేదారులు స్థానిక అధికార పార్టీ నాయకుల మద్దతుతో అనధికారికంగా బల్లకట్లు, పడవలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని గుత్తేదారులు టెండర్లు దాఖలు చేయడం లేదు. జడ్పీ అధికారులు ఇప్పటికి రెండు సార్లు టెండర్లు, బహిరంగ వేలం నిర్వహించినా ఒక్కరు కూడా వేలంలో పాల్గొనకపోవడం గమనార్హం. బయటి వ్యక్తులు ఎవరైనా టెండర్లు వేసేందుకు ముందుకు వస్తే వారిని స్థానిక నాయకులు అడ్డుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. అధికార పార్టీ నాయకులు సమ్మతిస్తేనే వేలంలో పాల్గొనాలని, లేకుంటే ఎవరూ పాల్గొనకూడదని స్పష్టం చేయడంతో గుత్తేదారులు వెనుకాడుతున్నారు. అంతిమంగా జిల్లాపరిషత్తు ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. పాలకవర్గం, అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు