icon icon icon
icon icon icon

Nara Rohit: కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి: నారా రోహిత్‌

ఏపీ ప్రజలంతా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి, రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేయాలని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. 

Updated : 07 May 2024 15:44 IST

చెరుకుపల్లి: ఏపీ ప్రజలంతా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి, రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేయాలని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం పరిధిలోని చెరుకుపల్లి మండలంలో కూటమి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌తో కలిసి నారా రోహిత్‌, హాస్యనటుడు రఘు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధి బాధ్యతలను చంద్రబాబు నాయుడు తీసుకుంటారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. యువత భవిష్యత్‌ బాగుండాలన్నా.. వలసలు ఆగాలన్నా కూటమి ప్రభుత్వం రావాలన్నారు. పవన్ సినిమాలో ‘లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా’ అన్నట్లు ప్రజలందరి ఓటు పంచ్‌తో ఫ్యాన్‌ రెక్కలు తెగిపడాలన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.

హాస్య నటుడు రఘు మాట్లాడుతూ.. వారసత్వంగా వచ్చిన ఆస్తులపై జగన్ ఫొటో ఎందుకని ప్రశ్నించారు. మన భూమి మీద జగన్ హక్కు ఏంటని మండిపడ్డారు. యువతకు కావాల్సింది ఉద్యోగాలనీ, చేపలు, గొర్రెలు పెంచుకోవడం కాదన్నారు. కంపెనీలు వస్తే యువతకు ఉద్యోగాలు వచ్చి అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇంట్లో కూర్చొని బటన్‌ నొక్కితే అభివృద్ధి సాధ్యమవుతుందా? అని నిలదీశారు. తాజా ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తే ప్రజలందరి భవిష్యత్ బాగుంటుందని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img