icon icon icon
icon icon icon

Palnadu: పోస్టల్‌ బ్యాలెట్‌లో తప్పిదం.. ఇద్దరు అధికారులపై చర్యలు

పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్‌ బ్యాలెట్‌లో జరిగిన తప్పిదంపై జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు.

Published : 07 May 2024 15:23 IST

చిలకలూరిపేట: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్‌ బ్యాలెట్‌లో జరిగిన తప్పిదంపై కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. నాదెండ్ల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి వరకుమార్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగించారు. రిటర్నింగ్‌ అధికారి నారదమునికి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఆయా ఉద్యోగులు 8, 9 తేదీల్లో మళ్లీ ఓటేయాలని సూచించారు.

చిలకలూరిపేట నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియను ఆదివారం నాదెండ్ల మండలం గణపవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు బదులు ఈవీఎంలో పెట్టే బ్యాలెట్‌ను ఉద్యోగులకు అందజేశారు. వారు దానిపైనే ఓటు వేశారు. అధికారుల తప్పిదం కారణంగా 1,219 మంది ఉద్యోగుల ఓట్లు ప్రశ్నార్థకంగా మారాయి. ఓటింగ్‌ పూర్తయిన తర్వాత గుర్తించిన అధికారులు.. ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనాకు జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చారు. తెదేపా నేతలు వర్ల రామయ్య, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు సీఈవోను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దీనికి బాధ్యులను చేస్తూ ఇద్దరు అధికారులపై కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img