logo

వైకాపా సోషల్‌ మీడియా బృందం నుంచి వేధింపులు

వైకాపా సోషల్‌ మీడియా బృందం కొన్ని రోజులుగా తనను వేధిస్తోందని, వ్యక్తిగతంగా కించపరుస్తూ అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టడం, ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడటం చేస్తున్నారని తెలుగు మహిళ తెనాలి నియోజకవర్గ అధ్యక్షురాలు పరుచూరి రమ్య తెలిపారు.

Published : 28 Mar 2023 05:57 IST

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న పరుచూరి రమ్య, ఇతర నాయకులు

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే : వైకాపా సోషల్‌ మీడియా బృందం కొన్ని రోజులుగా తనను వేధిస్తోందని, వ్యక్తిగతంగా కించపరుస్తూ అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టడం, ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడటం చేస్తున్నారని తెలుగు మహిళ తెనాలి నియోజకవర్గ అధ్యక్షురాలు పరుచూరి రమ్య తెలిపారు. ఈ మేరకు ఆమె పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సోమవారం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని అందించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు ఖుద్దూస్‌ మాట్లాడుతూ తమ నాయకురాలిని వేధించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. మహేష్‌, రమాదేవి, మీనా, హరికృష్ణ, విజయ్‌, అశోక్‌వర్థన్‌, జాఫర్‌, పూర్ణ, ప్రసాద్‌, కన్నయ్య, గిరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని