ప్రీమియం చెల్లిస్తేనే పరిహారం
గతంలో పశువులు చనిపోతే పరిహారం ఇచ్చేవారు. దీన్ని పశు నష్టపరిహారంగా పిలిచేవారు. ప్రస్తుతం వైఎస్సార్ పశు బీమాగా పేరు మార్చి.. నిబంధనలు మార్చారు.
పశు బీమా పథకంలో మార్పులు
పోషకుల్లో అనేక సందేహాలు
చిలకలూరిపేట గ్రామీణ, వినుకొండ, క్రోసూరు, న్యూస్‌టుడే
గతంలో పశువులు చనిపోతే పరిహారం ఇచ్చేవారు. దీన్ని పశు నష్టపరిహారంగా పిలిచేవారు. ప్రస్తుతం వైఎస్సార్ పశు బీమాగా పేరు మార్చి.. నిబంధనలు మార్చారు. ఈ పథకం ప్రకారం బీమా చేయించుకుంటేనే పరిహారం అందుతుంది. పాత పద్ధతిలో ఎన్ని పశువులకైనా ఇచ్చేవారు. కొత్తదాని ప్రకారం లక్ష్యం కూడా నిర్దేశించారు. దీంతో అందరికీ ఈ పథకం అందుతుందో.. లేదోననే సందేహం పశుపోషకులు వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా ఇలా..
కొత్త బీమా పథకం అమలు చేసేందుకు ఇండియా బీమా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రేషన్ కార్డు కలిగిన రైతులు రూ.30 వేల విలువ చేసే పశువుకు మూడేళ్ల కాలపరిమితికి రూ.384 చెల్లించాలి. అదే పెద్ద రైతులైతే రూ.960 కట్టాలి. రూ.30 వేల కంటే ఎక్కువ ధర ఉన్న పశువులకు అదనంగా 6.4 శాతం ప్రీమియం చెల్లించాలి. ఒక రైతు రూ.లక్షకు బీమా ప్రీమియం చెల్లించినా రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల వరకు మాత్రమే బీమా పరిహారం అందిస్తుంది. అంతకుమించి ఇవ్వదు.
గొర్రెలు, మేకలకు ఏడాదికి.. రెండేళ్లు.. మూడేళ్లకు బీమా చేయించుకోవచ్చు
ఎస్సీ, ఎస్టీ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (తెల్ల రేషన్‌కార్డు కలగిన) రైతులు ఒక గొర్రె లేదా మేకకు ఏడాదికి రూ.36, రెండేళ్లకు రూ.54, మూడేళ్లకు రూ.75 ప్రీమియం చెల్లించాలి. అదే పెద్ద రైతులైతే ఏడాదికి ఒకదానికి రూ.90, రెండేళ్లకు రూ.135, మూడేళ్లకు రూ.187.50 చెల్లించాలి. గొర్రెలు, మేకలు చనిపోతే ఒక్కోదానికి రూ.6 వేల చొప్పున బీమా పరిహారం చెల్లిస్తారు.
నిబంధనలు ఇలా..
* వైఎస్సార్ పశుబీమా పథకంలో భాగంగా ఆవులు, గేదెలు, కొత్తగా ఎద్దులు, గొర్రెలతో పాటు పందులను కూడా చేర్చారు. ఈ పథకంలో ఎద్దులు, పందులు లేవు. ఆవులు రెండేళ్ల నుంచి పదేళ్లలోపు వయసు ఉండాలి. ఒక ఈత పాలిచ్చినవై ఉండాలి. గేదెలు 3 నుంచి 12 ఏళ్ల వయసులో ఉండాలి. అవి కూడా ఒక ఈత పాలు ఇచ్చినవై ఉండాలి.
* ఎద్దులు, దున్నపోతులు పనిచేసేవి ఉండాలి. విదేశీజాతికి ఏడాదిన్నర నుంచి పదేళ్లు.. దేశీయ జాతికైతే రెండేళ్ల నుంచి పదేళ్లు ఉండాలి. గొర్రెలు మేకలు, పందులైతే 50 వరకు బీమా చెల్లించుకోవచ్చు.
* 2023-24 ఆర్థిక సంవత్సరానికి గొర్రెలు, మేకలు, పశువులు, పందులు అన్ని రకాలు కలిపి ఒక్కో నియోజకవర్గానికి 2500 లోపు మాత్రమే బీమా చేయాలని లక్ష్యం నిర్దేశించడం గమనార్హం. గతంలో ఇలాంటి నిబంధన లేదు.
* పశు పోషకులకు మేలు చేస్తుంది. వైఎస్సార్ పశు బీమా పథకం పశు పోషకులకు మేలు చేస్తుంది. పశువులకు కచ్చితంగా ట్యాగ్ వేయించుకోవాలి. సకాలంలో ప్రీమియం చెల్లించాలి. ఆ పశువులు చనిపోయినప్పుడే బీమా పరిహారం అందుతుంది. పథకం పారదర్శకంగా అమలవుతుంది. ఈ పథకం పట్ల పశు పోషకులు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే రైతులు దరఖాస్తులు కావాలని పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఆసక్తి ఉన్న వారంతా సంబంధిత వివరాలతో దరఖాస్తులు ఇవ్వాలి. సంబంధిత పశువుల ఆసుపత్రుల్లో వివరాలు తెలుసుకోవచ్చు.
శ్రీనివాసరావు, ఏడీ, పశుసంవర్ధక శాఖ, చిలకలూరిపేట.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు
-
TDP: ఎవరెస్ట్ వద్ద ఎగిరిన పసుపుజెండా
-
Justice Lakshmana Reddy: జస్టిస్ లక్ష్మణరెడ్డి అరుదైన రికార్డు
-
మీ వాళ్లు కబ్జా చేస్తే.. మీరు సెటిల్మెంట్ చేశారు: ఆదోని ఎమ్మెల్యే కుమారుడిని చుట్టుముట్టిన జనం
-
‘భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు ఏం చేశారు?’
-
AP News: హోం మంత్రి వస్తే ఊరొదిలి వెళ్లాలా?