హజ్ యాత్రకు ముస్లింల పయనం
నంబూరు మదరసా నుంచి బుధవారం ఉదయం హాజీలు హజ్‌యాత్రకు బయలుదేరి వెళ్లారు.
బస్సులను ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, గౌస్ లాజమ్, ముస్తఫా తదితరులు
నంబూరు(పెదకాకాని), న్యూస్‌టుడే : నంబూరు మదరసా నుంచి బుధవారం ఉదయం హాజీలు హజ్‌యాత్రకు బయలుదేరి వెళ్లారు. ఇక్కడి నుంచి నాలుగు ఆర్టీసీ ఏసీ బస్సుల్లో 170 మంది గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అంతకుముందు డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, హజ్ కమిటీ ఛైర్మన్ గౌస్ లాజమ్, ఎమ్మెల్యే ముస్తఫా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తరువాత పచ్చ జెండా ఊపగా బస్సులు బయలుదేరాయి. రాష్ట్ర ప్రభుత్వం మొదటి సారిగా గన్నవరం విమానాశ్రయ ఎంబార్కేషన్ పాయింటు నుంచి విమానం ఎక్కి హజ్‌కు వెళ్లారు. ఈ నెల 7 నుంచి 19 వరకు 1814 మంది రోజూ హజ్‌యాత్రకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.80వేలు చొప్పున రూ.14.51 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంతి జగన్‌మోహన్‌రెడ్డి జమచేసినట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.