logo

అయిదేళ్లుగా చోద్యం చూశారు!

ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన వంతెన ఇది. శిథిలావస్థకు చేరి అడుగు భాగం దిమ్మెలు పగుళ్లిచ్చాయి. ఇనుప రాడ్ల ఆధారంగా నిలబడింది. భారీ వాహనాలు ప్రయాణిస్తే దిమ్మెలు కదులుతున్నాయి.

Published : 18 Apr 2024 05:22 IST

వంతెనకు పగుళ్లు.. ప్రయాణానికి దిగులు

పగుళ్లిచ్చిన వంతెన అడుగు భాగం దిమ్మె

భట్టిప్రోలు, న్యూస్‌టుడే : ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన వంతెన ఇది. శిథిలావస్థకు చేరి అడుగు భాగం దిమ్మెలు పగుళ్లిచ్చాయి. ఇనుప రాడ్ల ఆధారంగా నిలబడింది. భారీ వాహనాలు ప్రయాణిస్తే దిమ్మెలు కదులుతున్నాయి. మండలంలోని పల్లెకోన గ్రామంలో మురుగుకాల్వపై నిర్మించిన వంతెన పరిస్థితి ఇది. రేపల్లె-భట్టిప్రోలు ప్రధాన రహదారి మార్గం కావడంతో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఇప్పటికే కోనేటిపురం వైపు కొంత కుంగింది. వాహనాలు ప్రయాణించే సమయంలో వంతెన ఊగుతోంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ నిర్వహించిన మంత్రి మేరుగు నాగార్జునకు నూతన వంతెన నిర్మించాలని గ్రామస్థులు విన్నవించారు. అయినా ఇప్పటి వరకు ఎటువంటి నిధులు మంజూరు కాలేదు. మురుగుకాల్వలో నీరు ఉద్ధృతంగా ఉన్నప్పుడు దిమ్మెలు బలహీనపడి వంతెన కూలుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. కాలం చెల్లిన వంతెనపై ప్రయాణిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నూతన వంతెనకు నిధులు మంజూరు చేయాలని  కోరుతున్నారు. ఈవిషయమై ఆô్అంè్బీ ఏఈ కృష్ణారావు మాట్లాడుతూ గతంలో ఈ రహదారిని జాతీయ రహదారి కింద గుర్తించారని తెలిపారు. తిరిగి ఆô్అంè్బీకి అప్పగిస్తే వంతెన నిర్మాణానికి నిధులు మంజూరవుతాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని