logo

జిల్లాలో 12,91,716 ఓటర్లు

సార్వత్రిక ఎన్నికలకు ముందు తుది ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా సోమవారం ప్రకటించారు. జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 12,91,716 మంది ఓటర్లు ఉన్నారు.

Published : 30 Apr 2024 06:25 IST

మూడున్నర నెలల్లో 16,176 మంది పెరుగుదల
అద్దంకిలో అత్యధికం..  బాపట్లలో అత్యల్పం

ఓటర్ల తుది జాబితా సిద్ధం చేస్తున్న సిబ్బంది

బాపట్ల, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలకు ముందు తుది ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా సోమవారం ప్రకటించారు. జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 12,91,716 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 6,29,794 కాగా మహిళా ఓటర్ల సంఖ్య 6,61,841గా ఉంది. ఇతర ఓటర్లు 81 మంది ఉన్నారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లు 32,047 మంది అధికంగా ఉన్నారు. 2024 జనవరి 9 నుంచి ఏప్రిల్‌ 29 నాటికి మూడున్నర నెలల్లో జిల్లాలో 16,176 మంది ఓటర్లు పెరిగారు. పెరిగిన ఓటర్లలో 90 శాతంపైగా తొలిసారి ఓటు హక్కు పొందిన యువ ఓటర్లు కావటం గమనార్హం. అద్దంకి నియోజకవర్గంలో అత్యధికంగా 2,44,057 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా బాపట్ల నియోజకవర్గంలో 1,90,925 మంది ఓటర్లు నమోదయ్యారు.

  • జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. అత్యధికంగా చీరాల నియోజకవర్గంలో 4,068 మంది ఓటర్లు పెరిగారు. ఆ తర్వాత పర్చూరు నియోజకవర్గంలో 3,563 మంది ఓటర్లు పెరిగి ద్వితీయ, బాపట్ల నియోజకవర్గంలో 3,201 మంది ఓటర్లు పెరిగి తృతీయ స్థానంలో నిలిచాయి.
  • రేపల్లె నియోజకవర్గంలో అత్యల్పంగా 666 మంది ఓటర్లు మాత్రమే పెరిగారు.
  • చీరాల నియోజకవర్గంలో పురుషుల కన్నా అత్యధికంగా మహిళా ఓటర్లు 5,229 మంది ఉండటం విశేషం. ఆ తర్వాత అద్దంకి నియోజకవర్గంలో పురుషుల కన్నా అత్యధికంగా మహిళా ఓటర్లు 4,905 మంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని