logo

పోరులో నిలిచింది 122 మంది

నామినేషన్ల తుది ఘట్టం ముగిసింది. ఉపసంహరణల అనంతరం ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు మొత్తం 122 మంది బరిలో నిలిచారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల నుంచి ఒక్కరు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు.

Published : 30 Apr 2024 06:28 IST

పార్లమెంటుకు 15.. అసెంబ్లీ స్థానాలకు 107

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట: నామినేషన్ల తుది ఘట్టం ముగిసింది. ఉపసంహరణల అనంతరం ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు మొత్తం 122 మంది బరిలో నిలిచారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల నుంచి ఒక్కరు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. పెదకూరపాడు, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో పరిశీలన అనంతరం ఉన్న అభ్యర్థులంతా బరిలో నిలిచారు. అత్యధికంగా చిలకలూరిపేటలో 25 మంది, అత్యల్పంగా పెదకూరపాడులో 11మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నరసరావుపేట పార్లమెంటు స్థానంలో నలుగురు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో 15 మంది మిగిలారు. ఈసారి రెండు ప్రధాన పార్టీల్లోనూ పెద్దగా రెబల్‌ అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు. ఎంపీ స్థానానికి కూడా రెబల్‌ బెడద లేదు. సత్తెనపల్లిలో మాత్రం జనసేన నుంచి రెబల్‌ అభ్యర్థిగా బొర్రా అప్పారావు నామినేషన్‌ వేసి ఉపసంహరించుకున్నారు. కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తికావడం, అభ్యర్థులెవరో తేలడంతో స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. జిల్లాలో పెదకూరపాడు, మాచర్లలో గాజు గ్లాసు కేటాయించడం ఆందోళనకు దారితీసింది. నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలు పూర్తిగా ప్రచారంపై దృష్టి పెట్టనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని