logo

టీహబ్‌కు తరలొస్తున్న ఔత్సాహికులు

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రాయదుర్గం హెచ్‌కేసీ(హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీ)లోని సాంకేతిక ఆవిష్కరణల కేంద్రం టీ-హబ్‌-2కు సందర్శకుల తాకిడి మొదలైంది.

Published : 30 Jun 2022 02:28 IST


టీ-హబ్‌ చూసేందుకు వెళ్తున్న సందర్శకులు

రాయదుర్గం, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రాయదుర్గం హెచ్‌కేసీ(హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీ)లోని సాంకేతిక ఆవిష్కరణల కేంద్రం టీ-హబ్‌-2కు సందర్శకుల తాకిడి మొదలైంది. ఈ కేంద్రానికి విశేష స్పందన లభిస్తోంది. ఆరంభమైన రెండో రోజు బుధవారం దీన్ని సందర్శించేందుకు, అందులో కార్యకలాపాలు ప్రారంభించి తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు మరికొంత మంది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. దాంతో ఈ కేంద్రం వద్ద సందడి నెలకొంది. బుధవారం ఉదయం నుంచే సందర్శకులు రావడం ప్రారంభించారు. ప్రస్తుతం ట్రిపుల్‌ ఐటీలో మొదటి దశ టీ-హబ్‌లో అంకురాలను కొత్త భవనంలోకి తరలించడంలో సిబ్బంది నిమగ్నమయ్యారు. సరికొత్త నిర్మాణాకృతితో అలరిస్తున్న టి-హబ్‌ ప్రారంభంతో రాయదుర్గం హెచ్‌కేసీ సాంకేతిక పర్యాటక కేంద్రంగా మారింది. భవనం వద్ద నిలబడి పలువురు సెల్ఫీలు తీసుకొని మురిసిపోయారు. పలువురు ఔత్సాహిక యువత టీహబ్‌కు వచ్చి అక్కడ అంకురాల ఏర్పాటుపై ఆరా తీశారు. కేంద్రంలోని వసతులు, కార్యాలయం ఏర్పాటు నియమ నిబంధనలను తెలుసుకున్నారు. నగరంతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్ల్లాలు, ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాల నుంచీ వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని