logo

పాఠశాల విద్యార్థులకు యూబీఐ వితరణ

కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఎండీ, సీఈవో ఎ.మణిమేఖలై ఆదివారం గౌలిగూడ, మహబూబ్‌గంజ్‌లోని శ్రీ సావిత్రి కన్య ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థినులకు 50 సైకిళ్లు, స్కూల్‌ సంచులు, గొడుగులు,

Published : 04 Jul 2022 03:57 IST


విద్యార్థినులకు సైకిళ్లు అందజేస్తున్న యూబీఐ ఎండీ, సీఈవో మణిమేఖలై

బేగంబజార్‌, న్యూస్‌టుడే: కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఎండీ, సీఈవో ఎ.మణిమేఖలై ఆదివారం గౌలిగూడ, మహబూబ్‌గంజ్‌లోని శ్రీ సావిత్రి కన్య ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థినులకు 50 సైకిళ్లు, స్కూల్‌ సంచులు, గొడుగులు, గోద్రేజ్‌ స్టోరేజ్‌ యూనిట్‌, వాటర్‌ కూలర్‌ అందించారు. ఉస్మాన్‌గంజ్‌లోని భాగ్యనగర్‌ అయ్యప్ప సేవా సమితి(బాస్‌) అనాథ శరణాలయాన్ని సందర్శించి 8 సైకిళ్లు, స్మార్ట్‌ టీవీ, వాటర్‌ కూలర్‌, రిఫ్రిజిరేటర్‌, 8 ఫ్యాన్లు అందజేశారు. బాస్‌ గౌరవ సలహాదార్లు దేవర రాజేశ్వర్‌, కట్ట మల్లేశం, బ్యాంకు అధికారులు కబీర్‌ భట్టాచార్య, సురేశ్‌, ప్రమోద్‌కుమార్‌, అజయ్‌పాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని