logo

మా ఫైనాన్స్‌ కిస్తీలు వాళ్లు కట్టించుకుంటున్నారు

‘మా వద్ద కార్లు, ఆటోలు, సరకు రవాణా వాహనాలను వాయిదాల పద్ధతిలో కొనుగోలుచేసిన వారికి సైబర్‌ నేరస్థులు ఫోన్లుచేసి కిస్తీలు కట్టాలంటూ బెదిరిస్తున్నారు’ అని టాటా మోటార్స్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను శనివారం

Published : 05 Jul 2022 01:21 IST

పోలీసులకు టాటా మోటార్స్‌ ఫిర్యాదు

ఈనాడు, హైదరాబాద్‌: ‘మా వద్ద కార్లు, ఆటోలు, సరకు రవాణా వాహనాలను వాయిదాల పద్ధతిలో కొనుగోలుచేసిన వారికి సైబర్‌ నేరస్థులు ఫోన్లుచేసి కిస్తీలు కట్టాలంటూ బెదిరిస్తున్నారు’ అని టాటా మోటార్స్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను శనివారం ఆశ్రయించారు. కొన్ని రోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు.. తమ సంస్థ నుంచి ఫైనాన్స్‌ విధానంలో కార్లు, ఆటోలు తీసుకున్నవారిలో చాలామందికి ఫోన్లు చేస్తున్నారని, ఈఎంఐలు చెల్లించాలంటూ చెబుతున్నారని పోలీస్‌ అధికారులకు వివరించారు. కార్లు తీసుకున్న వారిలో నలుగురైదుగురు తమకు ఫోన్లు చేసింది టాటా మోటార్స్‌ వారేనని భావించి, రూ.20 వేలు, రూ.10 వేల చొప్పున కిస్తీలూ చెల్లించారని పోలీసులకు తెలిపారు. ఈఎంఐ చెల్లించలేదంటూ సంక్షిప్త సందేశాలు వచ్చిన మరికొందరు తమను సంప్రదించగా.. ఈ మోసం తెలిసిందన్నారు. బాధితులు నగదు బదిలీ చేసిన ఖాతాలను పరిశీలించగా.. తమకు సంబంధంలేని బ్యాంకులని తేలిందని చెప్పారు. తమవద్ద ఉన్న వినియోగదారుల జాబితాను అపహరించిన వ్యక్తులే.. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని, వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని అభ్యర్థించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని