logo

అద్దెకు బస్సులిస్తాం..: ఆర్టీసీ

వికారాబాద్‌ ఆర్టీసీ డిపో నుంచి శబరిమలైకు బస్సులను అద్దెకు ఇస్తామని డిపో మేనేజర్‌ మహేశ్‌కుమార్‌ తెలిపారు.

Published : 02 Dec 2022 02:24 IST

వికారాబాద్‌ మున్సిపాలిటీ: వికారాబాద్‌ ఆర్టీసీ డిపో నుంచి శబరిమలైకు బస్సులను అద్దెకు ఇస్తామని డిపో మేనేజర్‌ మహేశ్‌కుమార్‌ తెలిపారు. ఈనెల 31 లోపు బస్సును బుక్‌ చేసుకున్న వారికి 10 శాతం రాయితీని ఇస్తామని, దర్శనం కూడా ఆర్టీసీ వారే కల్పిస్తారని అన్నారు. సూపర్‌ డీలక్స్‌ బస్సులో మొత్తం 35 మందితో పాటు అదనంగా ఇద్దరు వంట వారు, ఇద్దరు మణికంఠలు, గురుస్వామి ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. వివాహాలకు, శుభ కార్యాలయాలకు బస్సులు అద్దెకు ఇస్తామని ఇతర వివరాలకు వసంత్‌ చరవాణి నంబర్‌ 98666 18714ను సంప్రదించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని