logo

కొలత తప్పుతోంది.. కల్తీ భయపెడుతోంది

వ్యాపారుల లాభాపేక్షతో మధ్యతరగతి వినియోగదారుడు తీవ్రంగా నష్టపోతున్నాడు. కూరగాయలు, పండ్లు, బియ్యం, పప్పు, మాంసం తూకాల్లో మోసాలతో జేబులకు చిల్లులు పడుతున్నాయి.

Published : 09 Feb 2023 01:58 IST

ఈనాడు, హైదరాబాద్‌

వ్యాపారుల లాభాపేక్షతో మధ్యతరగతి వినియోగదారుడు తీవ్రంగా నష్టపోతున్నాడు. కూరగాయలు, పండ్లు, బియ్యం, పప్పు, మాంసం తూకాల్లో మోసాలతో జేబులకు చిల్లులు పడుతున్నాయి. లీగల్‌ మెట్రాలజీ విభాగం అధికారులు ప్యాకేజింగ్‌ కమొడిటీ, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న 1200 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. జనవరిలో 90 దుకాణాలపై చర్యలు తీసుకున్నారు. నగరవ్యాప్తంగా 14 మంది అధికారు దాడుల్లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మోసాన్ని గుర్తించొచ్చిలా: తూకం రాళ్ల మోసం గుర్తించేందుకు రాయి వెనక స్టాపింగ్‌ కోడ్‌ చూస్తే తెలిసిపోతుంది. 2023ఏ, బీ, సీ, డీ నంబర్లు ప్రతి తూకం రాయిపై ఉండాలి. 2023తో పాటు జనవరి నుంచి మార్చి వరకు ‘ఏ’ అని, ఏప్రిల్‌ - జూన్‌ వరకు ‘బి’, జులై నుంచి సెప్టెంబరు ‘సి’, అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ‘డి’ అని కోడ్‌ ఉంటుంది. ఇవి లేని తూకం రాళ్లతో కొనడం వద్దు. డిజిటల్‌ యంత్రాల్లో తూచే ముందు, ప్లేట్లు మార్చుతున్నప్పుడు యంత్రంలో ‘సున్నా’ నంబర్‌ చూపిస్తుందో లేదో గమనించాలి. తెలిసిన బరువును యంత్రంపై పెడితే ఎక్కువ లేదా తక్కువ చూపిస్తే మోసాలకు పాల్పడుతున్నట్టే.

కల్తీ భూతం: ప్యాకేజింగ్‌, బ్రాండింగ్‌, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతుల్లేని నూనెలు మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. చిరువ్యాపారులే లక్ష్యంగా ఓల్డ్‌సిటీ లో ఈ దందా సాగుతోంది. పశువుల కొవ్వుతో నూనెలు, ఎముకల చూర్ణంతో ‘టీ’ లో కలిపే మిశ్రమం తయారుచేస్తున్నారు.


కల్తీని కనిపెట్టొచ్చిలా...?

నిత్యావసర వస్తువుల్లో కల్తీని గుర్తించేందుకు ఫుడ్‌సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ కొన్ని సూచనలు చేసింది. వివరాలు https://www.fssai. gov.in/cms/check adulteration.php వెబ్‌సైట్‌లో.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని