Teenmar Mallanna: కానిస్టేబుళ్లపై దాడి కేసు.. చర్లపల్లి జైలుకు తీన్మార్‌ మల్లన్న

తీన్మార్‌ మల్లన్నతో పాటు ఐదుగురు నిందితులను హయత్‌నగర్‌ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించారు.

Published : 22 Mar 2023 20:32 IST

హైదరాబాద్‌: విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అపహరించి, దాడికి పాల్పడ్డారని తీన్మార్‌ మల్లన్నతో పాటు క్యూ న్యూస్‌ కార్యాలయంలో పనిచేసే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులను హయత్‌నగర్‌ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం 5గంటల సమయంలో ఫీర్జాదిగూడలోని రాఘవేంద్ర హోటల్‌ సమీపంలో ఇద్దరు కానిస్టేబుళ్లు మఫ్టీలో విధులు నిర్వహించారు. 

గొలుసు దొంగతనాలు నివారించడానికి తనిఖీలు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్ల దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వచ్చి వాదనకు దిగారు. ఇద్దరు కానిస్టేబుళ్లను సమీపంలో ఉన్న క్యూ న్యూస్‌ కార్యాలయంలోకి లాక్కెళ్లారు. క్యూ న్యూస్‌ కార్యాలయం చుట్టూ సంచరిస్తున్నారంటూ తీన్మార్‌ మల్లన్నతో పాటు, సిబ్బంది దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని ఇద్దరు కానిస్టేబుళ్లను క్యూ న్యూస్‌ కార్యాలయం నుంచి బయటకు తీసుకొచ్చారు. కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని