logo

రైల్వే ఆధ్యాత్మిక యాత్ర విజయవంతం

పూరీ.. కాశీ.. అయోధ్య ఇలా 9 రోజుల పాటు సాగే ‘భారత్‌ గౌరవ్‌’ ఆధ్యాత్మిక రైలు యాత్రకు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. ఈ నెల 18న మొట్టమొదటిసారి నగరం నుంచి పట్టాలెక్కిన ఈ రైలు ఆదివారం నగరానికి చేరుకుంది.

Published : 27 Mar 2023 01:33 IST

యాత్రికులతో ద.మ.రైల్వే జీఎం ఏకే జైన్‌

ఈనాడు, హైదరాబాద్‌, రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: పూరీ.. కాశీ.. అయోధ్య ఇలా 9 రోజుల పాటు సాగే ‘భారత్‌ గౌరవ్‌’ ఆధ్యాత్మిక రైలు యాత్రకు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. ఈ నెల 18న మొట్టమొదటిసారి నగరం నుంచి పట్టాలెక్కిన ఈ రైలు ఆదివారం నగరానికి చేరుకుంది. ఏప్రిల్‌ 18న మొదలయ్యే రెండో యాత్రకు టికెట్లు బుకింగ్‌ ప్రారంభించిన 4 రోజులకే అయిపోయాయి. దీంతో ఏప్రిల్‌ 29న మరో యాత్ర చేపట్టారు. ఆ యాత్రకూ టికెట్లు 5 రోజుల్లోనే అయిపోయాయని ఐఆర్‌సీటీసీ జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌ కిషోర్‌ చెప్పారు. మే 13న ప్రారంభమయ్యే యాత్రకు బుకింగ్‌ తెరిచామన్నారు. ప్రతి నెలా ఒకేసారి ఈ యాత్ర ఉంటుందని ముందుగా ప్రకటించినా.. ఆధ్యాత్మిక యాత్రికుల నుంచి డిమాండ్‌ పెరగడంతో నెలలో రెండు యాత్రలు నిర్వహిస్తున్నామని ద.మ. రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి సీహెచ్‌. రాకేష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని