logo

యోగాతో ఆరోగ్య భాగ్యం: గవర్నర్‌

క్రీడల్లో రాణించేవారికి రాజ్‌భవన్‌ ప్రోత్సాహం అందిస్తోందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. ఇటీవలే పారా అథ్లెట్‌ లోకేశ్వరికి ఆర్థిక ప్రోత్సాహం అందించినట్లు పేర్కొన్నారు.

Published : 27 May 2023 01:47 IST

చార్మినార్‌, న్యూస్‌టుడే: క్రీడల్లో రాణించేవారికి రాజ్‌భవన్‌ ప్రోత్సాహం అందిస్తోందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. ఇటీవలే పారా అథ్లెట్‌ లోకేశ్వరికి ఆర్థిక ప్రోత్సాహం అందించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ‘ఖేలో ఇండియా - జీతో ఇండియా భాగ్యనగర్‌’ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ‘క్రీడాకారులందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని తెలుగులో ప్రసంగం ప్రారంభించారు.  ఏసియన్‌ గేమ్స్‌, పారాలింపిక్స్‌, ఒలింపిక్స్‌ క్రీడాకారులను పిలిచి వారితో మాట్లాడి వారిని ప్రోత్సహించే సంప్రదాయానికి ప్రధాని శ్రీకారం చుట్టారని,  ‘యూత్‌ ఆఫ్‌ ది కంట్రీ వెల్త్‌ ఆఫ్‌ ది కంట్రీ’ అని నమ్మిన ప్రధాని సైన్స్‌, క్రీడలు ఇతర రంగాల్లో యువతను ప్రోత్సహించే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. చదువుతోపాటు ఆటలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. యోగా సాధన చేయాలని, తద్వారా ఆరోగ్యం సొంతమవుతుందన్నారు. విజేతలకు బహుమతులు, పతకాలు అందజేశారు.


ఆడటమూ ఓ హక్కే

జి.కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి

క్రీడాకారులకు ఆరోగ్యం, ఆహారం, కోచింగ్‌ అన్నింటిలో శ్రద్ధ పెట్టడంతో ఒలింపిక్స్‌లాంటి క్రీడల్లో పతకాలు సాధిస్తున్నాము. ప్రజాప్రతినిధులు సైతం ప్రోత్సహించాలని ప్రధాని సూచించారు. దీంతో ఒక్కోచోట 20 వేల నుంచి 30 వేల మంది పాల్గొంటున్నారు. నగరంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో చిన్నపిల్లలు మేమెక్కడ ఆడుకోవాలని ప్రశ్నించిన సంగతులు గుర్తొస్తున్నాయి. ప్రస్తుతం మైదానాలన్నీ కొన్నిచోట్ల పార్కులుగా మారిపోతే మరికొన్నిచోట్ల కబ్జాలకు గురవుతున్నాయి. పిల్లలందరికీ ఆటలాడుకునే హక్కుంది.


ప్రధాని ఆదేశాలతో క్రీడాపోటీలు

లక్ష్మణ్‌, రాజ్యసభ సభ్యుడు

స్థానిక ప్రభుత్వాలు క్రీడలకు సహకరించడం లేదు. ప్రధాని ఆదేశాలతో హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజవర్గాన్ని ఎంచుకొని ఇక్కడి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పాతనగరంలోని మైదానాల్లో కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో, అథ్లెటిక్స్‌, క్రికెట్‌ పోటీలను నిర్వహించాము. 300కుపైగా టీమ్‌లు పాల్గొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని