logo

ఓట్లు కొల్లగొట్టారు

ఎన్నికలు అనగానే అభ్యర్థుల గెలుపోటములు సాధారణం. వీటిలో కొన్ని రికార్డులు చరిత్రలో నిలిచిపోతాయి. కొన్ని స్వల్ప మెజారిటీతో గెలిచినవి, మరికొన్ని ప్రత్యర్థుల డిపాజిట్లు కొల్లగొట్టినవి కూడా ఉంటాయి.

Updated : 25 Nov 2023 05:38 IST
ఉమ్మడి జిల్లాలో అత్యల్పం, అత్యధిక రికార్డులు కేటీఆర్‌వే
ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల
ఎన్నికలు అనగానే అభ్యర్థుల గెలుపోటములు సాధారణం. వీటిలో కొన్ని రికార్డులు చరిత్రలో నిలిచిపోతాయి. కొన్ని స్వల్ప మెజారిటీతో గెలిచినవి, మరికొన్ని ప్రత్యర్థుల డిపాజిట్లు కొల్లగొట్టినవి కూడా ఉంటాయి. ఫలితాలు వచ్చే వరకు అభ్యర్థులకు వారి పార్టీ నాయకులకు తీవ్ర ఉత్కంఠ తప్పదు. ఉమ్మడి జిల్లాలో 1952 నుంచి 2018 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికలు, వాటి ఫలితాలను పరిశీలిస్తే...
మ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉండేవి. జిల్లాల ఏర్పాటుతో హుస్నాబాద్‌ సిద్దిపేట జిల్లాలోకి వెళ్లింది. ప్రస్తుతం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో వేములవాడ, మానకొండూరు, ధర్మపురి, రామగుండం, కోరుట్ల ఏర్పడ్డాయి. మిగతా ఏడు నియోజకవర్గాలు పాతవే. ఈ అన్ని నియోజకవర్గాలను పరిశీలిస్తే ఉమ్మడి జిల్లాలో 2009లో జరిగిన ఎన్నికల్లో కె.తారక రామారావు (కేటీఆర్‌) ప్రత్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 171 ఓట్లతో గెలిచారు. ఇప్పటికీ ఇదే అతి స్వల్పం. 2018లో జరిగిన ఎన్నికల్లో కె.తారక రామారావు 89,009 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఉమ్మడి జిల్లాలో ఇదే భారీ మెజారిటీ. పాత, కొత్త నియోజక వర్గాల్లో అత్యల్పం నమోదైన చోటే కేటీఆర్‌ భారీ ఆధిక్యం సాధించడం విశేషం. అంతకు ముందెప్పుడు ఈ మెజారిటీ రాలేదు. 1996 జగిత్యాల ఉప ఎన్నికలో తెదేపా అభ్యర్థి వేణుగోపాల్‌రావుపై జీవన్‌రెడ్డి 53,910 ఓట్ల మెజారిటీ సాధించారు.
 

2018లో జగిత్యాల నుంచి సంజయ్‌కు 61,185 మెజారిటీ వచ్చింది. ఈ ఎన్నికల్లో సంజయ్‌కు 1,04,247 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన జీవన్‌రెడ్డికి 43,062 వచ్చాయి. సిరిసిల్లలో కేటీఆర్‌కు 89,009 మెజారిటీ సాధించారు. కేటీఆర్‌కు 1,25,213 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన కేకే మహేందర్‌రెడ్డికి 36,204 వచ్చాయి.


2010 ఉప ఎన్నికలో హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్‌కు 79,227 మెజారిటీ వచ్చింది. అప్పుడు తెరాస నుంచి ఈటలకు 93,026 ఓట్లు రాగా, ద్వితీయ స్థానంలో ఉన్న తెదేపా అభ్యర్థి దామోదర్‌రెడ్డికి 13,799 వచ్చాయి.


2014లో పెద్దపల్లి నుంచి పోటీ చేసిన దాసరి మనోహర్‌రెడ్డికి 62,686 మెజారిటీ వచ్చింది. తెరాస (భారాస) మనోహర్‌రెడ్డికి 96,220 ఓట్లు పోలవగా, కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉన్న భానుప్రసాద్‌రావుకు 33,543 వచ్చాయి. ఇదే ఎన్నికల్లో చొప్పదండి నుంచి తెరాస నుంచి బరిలో నిలిచిన బొడిగె శోభకు 54,981 మెజారిటీ వచ్చింది. శోభకు 86,841 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన సుద్దాల దేవయ్యకు 31,860 వచ్చాయి. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ 57,037 మెజారిటీ సాధించారు. రాజేందర్‌కు 95,315 ఓట్లు రాగా, సుదర్శన్‌రెడ్డికి 38,278 వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు