logo

ఆదర్శం.. ఈ పఠనాలయం

చొప్పదండిలోని శాఖా గ్రంథాలయం జిల్లా కేంద్రానికి దీటుగా పని చేస్తూ అందరి మన్ననలు పొందుతోంది. నిరుద్యోగులకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది

Published : 27 Mar 2024 03:28 IST

చదువుకుంటున్న పాఠకులు
న్యూస్‌టుడే, చొప్పదండి: చొప్పదండిలోని శాఖా గ్రంథాలయం జిల్లా కేంద్రానికి దీటుగా పని చేస్తూ అందరి మన్ననలు పొందుతోంది. నిరుద్యోగులకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. రోజూ పత్రిక పఠనానికి 150 నుంచి 180 మంది వరకు వస్తుండగా పలు పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు సుమారు 50 మంది వరకు వస్తుంటారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు.

 ప్రత్యేకతలు ఇలా...

  •  రూ.25 లక్షలతో పాత భవనానికి అధునాతన హంగులతో ఏర్పాట్లు చేశారు.
  •  పాఠకులను ఆకట్టుకునేలా భవనంపై ప్రత్యేక పెయింటింగ్‌ వేయించారు.
  •  పాఠకులకు శుద్ధజలం అందుబాటులో ఉంచారు.
  •  చుట్టూ ప్రహరీతో రక్షణ, నూతన శౌచాలయాలు, మరుగుదొడ్ల నిర్మాణంతో పరిశుభ్రత.
  •  ప్రస్తుతం గ్రంథాలయంలో 11,220 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
  •  726 మంది పాఠకులు సభ్యత్వం కలిగి ఉన్నారు.
  •  ప్రతి రోజు నాలుగు ఆంగ్ల పత్రికలతోపాటు 14 దినపత్రికలు అందుబాటులో ఉంటాయి.
  •  పోటీపరీక్షలకు ఉపయోగపడే పక్ష, మాసపత్రికలు తెప్పిస్తున్నారు.
  •  వేసవిలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందిలేకుండా ఏసీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు.
  •  సీసీ కెమెరాలతో నిఘా పటిష్ఠం.

   పాఠకుల వినతి..

గ్రంథాలయం సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చేయడంతోపాటు మరిన్ని కుర్చీలు ఏర్పాటు చేయాలని పాఠకులు కోరుతున్నారు. గ్రూప్స్‌, డీఎస్సీ, బ్యాంకింగ్‌కు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ అందజేస్తే బాగుంటుందని పాఠకులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని