logo

పాఠశాల వ్యాన్‌ కిందపడి చిన్నారి మృతి

చిన్నారి పాఠశాల వ్యాన్‌కిందపడి మృతి చెందిన ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే. .

Published : 16 Apr 2024 12:55 IST

జగిత్యాల రూరల్‌: చిన్నారి పాఠశాల వ్యాన్‌కిందపడి మృతి చెందిన ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే. .మల్యాల మండలం మద్దుట్లలో అరిబా (1) అనే చిన్నారి తల్లితోపాటు అన్నను పాఠశాలకు పంపేందుకు స్కూల్‌ వ్యాన్‌ వద్దకు  వెళ్లింది. అన్నకు టాటా చెప్తూ వ్యాన్‌ దగ్గరకు వెళ్లింది. ఇంతలో ఒక్కసారిగా డ్రైవర్‌ వ్యాన్‌ స్టార్ట్‌ చేయడంతో  అరిబా టైరు కింది పడి మృతి చెందింది. అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి ఒక్కసారిగి మృతి చెందడంతో తల్లిదండ్రులతోపాటు.. స్థానికులను కలిసి వెసింది.  మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పంచనామ నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని