logo

ఉమ్మడి జిల్లాలో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

ఈ వేసవి సీజన్‌లో ఉమ్మడి జిల్లాలో తొలిసారి మంగళవారం గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి.

Published : 17 Apr 2024 05:16 IST

జగిత్యాల ధరూర్‌క్యాంపు, న్యూస్‌టుడే: ఈ వేసవి సీజన్‌లో ఉమ్మడి జిల్లాలో తొలిసారి మంగళవారం గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. జగిత్యాల జిల్లా గోధూరు, వెల్గటూరులో రాష్ట్రస్థాయిలోనే ద్వితీయంగా 44.6 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్తన్‌పేటలో 44.5, జగిత్యాల జిల్లా నేరెళ్లలో 44.4, కరీంనగర్‌ జిల్లా వీణవంకలో 44.2, పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారంలలో 43.8 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నెలకొంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరగగా వడగాలులు వీయటంతో ఎండతీవ్రత మరింతగా హెచ్చి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. రాగల అయిదు రోజుల్లోనూ ఇదేస్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నెలకొంటాయని, అక్కడక్కడ తేలికపాటి జల్లులుకురిసే అవకాశముందని జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని