logo

అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా!

ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయాలకు, ప్రజా సేవకు కొత్తకాదని, అవకాశమిస్తే పార్లమెంట్‌ పరిధిని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్‌ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ పేర్కొన్నారు.

Published : 23 Apr 2024 02:11 IST

భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌

సమావేశంలో భారాస అభ్యర్థి గోవర్ధన్‌, ఎమ్మెల్యే సంజయ్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత

సారంగాపూర్‌, న్యూస్‌టుడే: ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయాలకు, ప్రజా సేవకు కొత్తకాదని, అవకాశమిస్తే పార్లమెంట్‌ పరిధిని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్‌ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ పేర్కొన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలంలోని పెంబట్ల, రేచపల్లి, బీర్‌పూర్‌ మండలంలోని తుంగూర్‌లో ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత, ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం.సంజయ్‌కుమార్‌, మాజీ మంత్రి రాజేశంగౌడ్‌తో కలిసి కార్నర్‌ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ పదేళ్ల పాలనలో వ్యవసాయం పండగలా మారిందని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. మండలంలోని రేచపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, మార్క్‌ఫెడ్‌ మాజీ ఛైర్మన్‌ లోక బాపురెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు మేడిపల్లి మనోహర్‌రెడ్డి, కేడీసీసీ డైరెక్టర్‌ ముప్పాల రాంచందర్‌రావు, ఉపాధ్యక్షుడు సొల్లు సురేందర్‌, తదితరులు పాల్గొన్నారు.  

కొండగట్టులో ముడుపు కట్టిన నిజామాబాద్‌ భారాస అభ్యర్థి

మల్యాల, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ సోమవారం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని ముడుపుకట్టారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, మాజీ మంత్రి రాజేశంగౌడ్‌, దావ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్‌ చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం నుంచి కొండగట్టులో అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు పర్చగా భారాస అభ్యర్థి ప్రత్యేక పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఆలయ ఈవో చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ముడుపుకట్టిన విషయం తనకు తెలియదని, వివరాల తెలుసుకుని చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని