logo

వికటించిన దుస్సాహసం

అందరినీ ఆకట్టుకోవాలనే ఉత్సాహం వికటించింది. దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి పడడంతో ఆ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన చిక్కబళ్లాపుర సమీపంలోని శ్రీనివాససాగర్‌ జలాశయం కట్టవద్ద చోటుచేసుకుంది. సోమవారం వైరల్‌గా మారిన ఈ సంఘటన వివరాల్లోకెళ్తే..

Published : 24 May 2022 02:28 IST

అందరినీ ఆకర్షించాలని ఇలా ఆనకట్టను ఎక్కుతూ.. పట్టుతప్పి జారుతూ..

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే : అందరినీ ఆకట్టుకోవాలనే ఉత్సాహం వికటించింది. దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి పడడంతో ఆ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన చిక్కబళ్లాపుర సమీపంలోని శ్రీనివాససాగర్‌ జలాశయం కట్టవద్ద చోటుచేసుకుంది. సోమవారం వైరల్‌గా మారిన ఈ సంఘటన వివరాల్లోకెళ్తే.. పొంగిపొర్లుతూ జలపాతాన్ని తలపిస్తున్న శ్రీనివాససాగర్‌ జలశాయాన్ని వీక్షించేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు ఆనకట్ట కట్టడం రాళ్లను పట్టుకుని ఎక్కేందుకు ప్రయత్నించాడు. నీళ్లు జోరుగా పడుతున్నా తన సాహస విన్యాసం ద్వారా అందరినీ ఆకర్షించాలనుకున్నాడేమో! పాచి కారణంగా జారుతున్నా పట్టుదలతో ఎగబాకాడు. 20 అడుగుల ఎత్తు వరకు వెళ్లేసరికి ఒక్కసారిగా పట్టుసడిలింది. ఫలితం.. అంత ఎత్తునుంచి జారిపడ్డాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విహార యాత్రకు అనుమతిస్తే ఇలాంటి సాహసాలు చేస్తారా అంటూ ఈ సంఘటన అనంతరం శ్రీనివాససాగర జలాశయం వద్ద మరింత కఠినమైన ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. దూరం నుంచి మాత్రమే చూసేలా చర్యలు తీసుకున్నారట.

కిందపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని