logo

రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ

సుళ్య తాలూకా బెళ్లారెలో భాజపా యువ మోర్చా కార్యకర్త ప్రవీణ్‌ నెట్టారు హత్య కేసు దర్యాప్తును జాతీయ తనిఖీ దళం (ఎన్‌ఐఏ) ప్రారంభించింది. దిల్లీలో ఈ కేసుకు సంబంధించి కొత్త ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసుకుంది.

Published : 09 Aug 2022 02:25 IST


ప్రవీణ్‌ నెట్టారు

మంగళూరు, న్యూస్‌టుడే : సుళ్య తాలూకా బెళ్లారెలో భాజపా యువ మోర్చా కార్యకర్త ప్రవీణ్‌ నెట్టారు హత్య కేసు దర్యాప్తును జాతీయ తనిఖీ దళం (ఎన్‌ఐఏ) ప్రారంభించింది. దిల్లీలో ఈ కేసుకు సంబంధించి కొత్త ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసుకుంది. ఈ వారంలోనే ఎన్‌ఐఏ ప్రతినిధులు కర్ణాటకకు వచ్చి దర్యాప్తు ప్రారంభించనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రవీణ్‌ హత్య కేసుకు సంబంధించి సుళ్య సమీపంలోని నావూరకు చెందిన అబిద్‌, బెళ్లారె నివాసి నౌఫాల్‌ను స్థానిక పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. వీరి అరెస్టుతో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. హత్యకు ముందే నిందితులు రెక్కీ నిర్వహించారని గుర్తించారు. ప్రవీణ్‌ తన మాంసం దుకాణం నుంచి బయటకు వచ్చే సమయం కోసం పొంచి ఉండి, హత్య చేశారని తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని