logo

తొట్టెలపాడు..

మండే ఎండలకు చెరువులు, బావులు, ఇతర జలాశయాలు ఎండిపోతున్నాయి. వేసవిలో పక్షులు, ఇతర మూగజీవాలు నీరు దొరక్క దాహార్తితో అల్లాడుతున్నాయి.

Published : 18 Apr 2024 05:47 IST

మండే ఎండలకు చెరువులు, బావులు, ఇతర జలాశయాలు ఎండిపోతున్నాయి. వేసవిలో పక్షులు, ఇతర మూగజీవాలు నీరు దొరక్క దాహార్తితో అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పక్షులకు నీరందించేందుకు తిరుమలాయపాలెం మండలం తెట్టెలపాడు గ్రామ కార్యదర్శి వినోద్‌ వినూత్న ఆలోచన చేశారు. మట్టి కుండల్ని భాగాలుగా చేసి వాటి సాయంతో నీటితొట్లను తయారు చేస్తున్నారు. ఆ తొట్లను పంచాయతీ సిబ్బంది దారెంట ఉండే చెట్టుకొమ్మలపై ఉంచి కిందపడకుండా దారాలతో కట్టారు. ఇప్పటికే పది తొట్లు అమర్చారు. వీటిలో ప్రతీ రోజు గ్రామ పంచాయతీ సిబ్బంది నీరు పోస్తున్నారు.

తిరుమలాయపాలెం, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని