logo

సంఘీభావ యాత్రకు మద్దతు

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో రైతులు చేస్తున్న మహాపాదయ్రాతకు మద్దతుగా నగరంలో తెదేపా ఆధ్వర్యాన చేపట్టిన సంఘీభావయాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. మాజీ మంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యుడు

Published : 07 Dec 2021 02:25 IST

యాత్రలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర,

మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు తదితరులు

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో రైతులు చేస్తున్న మహాపాదయ్రాతకు మద్దతుగా నగరంలో తెదేపా ఆధ్వర్యాన చేపట్టిన సంఘీభావయాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. మాజీ మంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర నేతృత్వంలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం ఉదయం కాలేఖాన్‌పేట నుంచి ప్రారంభమై రాత్రి కోనేరుసెంటరుతో ముగిసిన యాత్రకు అడుగడునా ప్రజాదరణ లభించింది. మంగళహారతులు, పూలదండలతో స్వాగతం పలికిన మహిళలు, వ్యాపార, వర్తక సంస్థల ప్రతినిధులతో పాటు సామాన్య ప్రజలు సైతం రాజధాని విషయంలో తమ అభిమతాన్ని చాటుకుంటూ రైతుల యాత్ర కోసం స్వచ్ఛందంగా సుమారు రూ.10 లక్షల వరకూ విరాళాలుగా సమర్పించారు. యాత్రలో భాగంగా వివిధ కూడళ్లలో కొల్లు, కొనకళ్ల మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ నాయకులు కొనకళ్ల జగన్నాథరావు, మోటమర్రి బాబాప్రసాద్‌, గోపు సత్యనారాయణ తదితరులతో పాటు వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని