logo

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

పీఆర్సీ జీవోకు వ్యతిరేకంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడిలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి మచిలీపట్నం వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు గురువారం అరెస్టు చేసి సమీప పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. అలా పలువురు ఉపాధ్యాయులను

Published : 21 Jan 2022 03:11 IST

పోలీస్‌ స్టేషన్‌ ఎదుటా ఉపాధ్యాయుల నిరసన

గూడూరు: స్టేషన్‌ ఎదుట నిరసన తెలుపుతున్న

ఫ్యాప్టో నాయకులు, ఉపాధ్యాయులు

గూడూరు, న్యూస్‌టుడే: పీఆర్సీ జీవోకు వ్యతిరేకంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడిలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి మచిలీపట్నం వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు గురువారం అరెస్టు చేసి సమీప పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. అలా పలువురు ఉపాధ్యాయులను గూడూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించగా నాయకులు, ఉద్యోగులు స్టేషన్‌ ఎదుట ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని నినదించారు.

ముదినేపల్లి: కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమానికి మండలం నుంచి వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు తరలివెళ్లారు. ఈసందర్భంగా యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.రమేశ్‌ మాట్లాడుతూ ఉద్యోగులకు బకాయిలు ఉన్న మొత్తం డీఏలను ఇప్పుడు ప్రకటించి ఉద్యోగుల జీతాలు తగ్గడం లేదని చెప్పడం సరికాదన్నారు. సీపీఎస్‌పై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.

గంపలగూడెం: తోటమూల నుంచి ప్రదర్శనగా బయల్దేరిన ఉపాధ్యాయులు

గంపలగూడెం: మండలంలో డీపీఆర్టీయూ, యూటీఎఫ్‌, ఎస్టీయూ సంఘాల తరఫున 50 మంది వరకు ఉపాధ్యాయులు మచిలీపట్నంలో కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమానికి గురువారం తరలివెళ్లారు. పీఆర్సీ, డీఏ బకాయిలు, సీసీఏ, సీపీఎస్‌పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేక నినాదాలు చేస్తూ తోటమూల నుంచి వాహనాల్లో ప్రదర్శనగా వెళ్లారు. ఆందోళనలో పాల్గొన్న గంపలగూడెం మండలానికి చెందిన పలువురు ఉపాధ్యాయులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.

కలిదిండి: తమ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌, ఎస్‌టీయూ, డీపీఆర్టీయూ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. పీఆర్సీ, హెచ్‌ఆర్సీలపై తాజా జీవోలతో పాటు సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ మచిలీపట్నంలో నిర్వహించిన కలెక్టరేట్‌ ముట్టడికి మండలం నుంచి ఆయా సంఘాల ప్రతినిధులు తరలివెళ్లారు.

‘ఉద్యోగులను వంచించడం తగదు’

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: పీఆర్సీ పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను ప్రభుత్వం వంచించడం తగదని మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్‌ బండి రామకృష్ణ అన్నారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ మంత్రులు, శాసనసభ్యులు, ఇతరత్రా ప్రభుత్వ పదవుల్లో ఉన్న నాయకులు రూ.లక్షల్లో జీతాలు, భత్యాలు పొందుతూ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండే ఉద్యోగుల విషయంలో రివర్స్‌ పీఆర్‌సీ అమలు చేయడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని లేనిపక్షంలో వారి పోరాటానికి జనసేన మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు లంకిశెట్టి బాలాజీ, సింగలూరి శాంతిప్రసాద్‌, పినిశెట్టి ఛాయాదేవి, వంపుగడవల చౌదరి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని