logo

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమొద్దు

విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్‌ బారిన పడుతున్నా పాఠశాలలు నిర్వహించి ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు దావు నాగరాజు కోరారు. అల్లూరు ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో పలువురు ఉపాధ్యాయులకు కరోనా సోకిందనే

Published : 23 Jan 2022 03:11 IST

ముదినేపల్లి: ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న నాగరాజు, గ్రామస్థులు

అల్లూరు (ముదినేపల్లి), న్యూస్‌టుడే: విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్‌ బారిన పడుతున్నా పాఠశాలలు నిర్వహించి ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు దావు నాగరాజు కోరారు. అల్లూరు ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో పలువురు ఉపాధ్యాయులకు కరోనా సోకిందనే సమాచారంతో ఆయన, గ్రామస్థులు కలిసి ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఉన్నత పాఠశాలలో ఎనిమిది మందికి ముగ్గురే ఉపాధ్యాయులు రావటం, ప్రాథమిక పాఠశాలలో మరొకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందనే విషయమై నాగరాజు మాట్లాడుతూ ఇప్పటికీ పాఠశాలల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించలేదని, ఉపాధ్యాయులే మాస్క్‌లు ధరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఉపాధ్యాయురాలు పిల్లలతో మందులు తెప్పిచుకున్నారని, ఈ తరుణంలో విద్యార్థుల ఆరోగ్యానికి ఎవరు భరోసా ఇస్తారని ప్రశ్నించారు. వెంటనే పరీక్షలు నిర్వహించి లక్షణాలు ఉన్నవారిని పాఠశాలకు రానివ్వద్దని కోరారు.

నిబంధనల మేరకు తరగతులు

తిరువూరు: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కొవిడ్‌ నిబంధనలకు లోబడి తరగతులు నిర్వహించాలని కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల వృత్తి విద్యాశాఖాధికారి (డీవీఈవో) బీఎస్‌ఆర్‌వీ ప్రసాద్‌ సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి అధ్యాపకులు నిర్దుష్ట ప్రణాళికతో బోధించాలని సూచించారు. విద్యార్థుల ప్రవేశాలు, హాజరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. దాతల సహకారంతో కళాశాలకు వసతులు సమకూర్చిన ప్రిన్సిపల్‌ రెబ్బు మురళీకృష్ణను అభినందించారు. అనంతరం ఆయన కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని