logo

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు

విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రాంతీయ అధికారి తిరుమలేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు శనివారం ఉమ్మడి జిల్లాల్లోని ఫర్టిలైజర్‌ దుకాణాలపై దాడి చేశారు. దేవనకొండలోని లక్ష్మీనర్సింహస్వామి ట్రేడర్స్‌కు సరైన అనుమతులు లేనందున 56 లీటర్ల (20 రకాలు)

Published : 03 Jul 2022 02:10 IST

తనిఖీ చేస్తున్న అధికారులు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రాంతీయ అధికారి తిరుమలేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు శనివారం ఉమ్మడి జిల్లాల్లోని ఫర్టిలైజర్‌ దుకాణాలపై దాడి చేశారు. దేవనకొండలోని లక్ష్మీనర్సింహస్వామి ట్రేడర్స్‌కు సరైన అనుమతులు లేనందున 56 లీటర్ల (20 రకాలు) మందుల అమ్మకాలను నిలిపేశారు. దేవనకొండలో వెంకటసాయి ట్రేడర్స్‌, కోడుమూరులోని లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్‌, విశ్వజీత్‌ ట్రేడర్స్‌ ఆత్మకూరులోని శ్రీసాయి వెంకటేశ్వర ఏజెన్సీస్‌, రైతు ఆగ్రో ట్రేడర్స్‌ వెలుగోడులోని లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్‌ దుకాణాలను తనిఖీ చేశారు. వివిధ అంశాలను పరిశీలించారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐలు నాగరాజుయాదవ్‌, కేశవరెడ్డి, శ్రీధర్‌ ఏవో రూపాస్‌, ఏజీ సిద్ధయ్య, ఎఫ్‌ఆర్‌వో ఖాన్‌ ఎస్సై జయన్న ఏఈ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని