logo

అశ్వవాహనంపై.. ఆది దంపతులు

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల తొమ్మిదో రోజు మంగళవారం భ్రమరాంబాదేవి సిద్ధిదాయిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష పుష్పాలంకరణలతో దేదీప్యమాన రూపంలో కొలువుదీరి పూజలందుకున్నారు.

Published : 05 Oct 2022 02:32 IST

క్యాలండర్లను విడుదల చేస్తున్న మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా, ఈవో తదితరులు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల తొమ్మిదో రోజు మంగళవారం భ్రమరాంబాదేవి సిద్ధిదాయిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష పుష్పాలంకరణలతో దేదీప్యమాన రూపంలో కొలువుదీరి పూజలందుకున్నారు. అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై అధిష్ఠింపజేశారు. అర్చకులు, వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవానికి తీసుకురాగా ధర్మకర్తలమండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్‌.లవన్న, ధర్మకర్తలు కర్పూర హారతులతో నారికేళాలు సమర్పించారు. రాజగోపురం నుంచి గంగాధరమండపం, నందిమండపం బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం కనులపండువగా జరిగింది.

నీరాజన మండపం ప్రారంభం
భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ 2023 దేవస్థానం కాలమానినులను ఆవిష్కరించారు. అనంతరం ఆలయ పుష్కరిణి మధ్యలో దాతల సహకారంతో నిర్మించిన నీరాజన మండపాన్ని మంత్రి ప్రారంభించారు. శ్రీశైలానికి మరో బృహత్తర ప్రణాళిక తయారు చేసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని