logo

ఐదుగురికి అరుదైన శస్త్రచికిత్సలు

అరుదైన శస్త్రచికిత్సలు చేయడం ద్వారా ఐదుగురి ప్రాణాలు కాపాడినట్లు కార్డియోథోరాసిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ ప్రభాకరరెడ్డి తెలిపారు.

Published : 21 Mar 2023 02:26 IST

వివరాలు వెల్లడిస్తున్న డాక్టర్‌ ప్రభాకరరెడ్డి

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: అరుదైన శస్త్రచికిత్సలు చేయడం ద్వారా ఐదుగురి ప్రాణాలు కాపాడినట్లు కార్డియోథోరాసిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ ప్రభాకరరెడ్డి తెలిపారు. ఆపరేషన్‌ చేయించుకున్న కేదేశ్వరయ్య, పుల్లారెడ్డి, లక్ష్మన్న, శ్రీనివాసరెడ్డి, నిహాంత్‌ బాధితులతోపాటు ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ నరేంద్రనాథ్‌రెడ్డి, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుధాకర్‌, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ వెంకటేశ్వరరావుతో కలిసి సోమవారం వివరాలు వెల్లడించారు. ఆటో డ్రైవరైన కేదేశ్వరయ్య (54)కు గత నెల 15న మినిమల్‌ ఇన్‌వేసిన్‌ కార్డియా సర్జరీ చేశామని తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన మోక్షగుండం అనే వ్యక్తి రెండు ఊపిరితిత్తులు చెడిపోయాయని, ఫిబ్రవరి 20న అతనికి ఊపిరితిత్తుల ఆపరేషన్‌ చేశామన్నారు. లక్ష్మన్న(30) అనే వ్యక్తికి మార్చి 6న వాల్వ్‌ రీప్లేస్‌మెంటు ఆపరేషన్‌ చేశామన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన రైతు శ్రీనివాసరెడ్డి కత్తిపోట్లకు గురవగా మార్చి 12న వి.ఎస్‌.డి. శస్త్రచికిత్స చేశామన్నారు. ఈనెల 16న నిహాంత్‌ (7) అనే పిల్లాడి గుండెకు అరుదైన శస్త్రచికిత్స చేయడం ద్వారా ప్రాణాలు కాపాడినట్లు వివరించారు. ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేయాలంటే రూ.లక్షలు ఖర్చవుతుందని పేర్కొన్నారు. కర్నూలు సర్వజన ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్‌ కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని